Hafiz Saeed: పాకిస్తాన్ లో పేలుడు…ఇద్దరి మృతి, 16 మందికి గాయాలు… ఉగ్రవాది హఫీద్ సయీద్ ఇంటివద్దే..

పాకిస్తాన్ లోని లాహోర్ లో బుధవారం జరిగిన పేలుడులో ఇద్దరు మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. ముంబై పేలుళ్ల సూత్రధారి జమా ఉద్ దావా చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్ ఇంటికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. లాహోర్ లోని జోహార్ టౌన్ లో జరిగిన ఈ ఘటన

Hafiz Saeed: పాకిస్తాన్ లో పేలుడు...ఇద్దరి మృతి, 16 మందికి గాయాలు... ఉగ్రవాది హఫీద్ సయీద్ ఇంటివద్దే..
Pakistan Lahore Blast Two Dead16 Injured Terrorist Hafiz Sayeed,terrorist Hafiz Sayeed,
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 23, 2021 | 4:11 PM

పాకిస్తాన్ లోని లాహోర్ లో బుధవారం జరిగిన పేలుడులో ఇద్దరు మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. ముంబై పేలుళ్ల సూత్రధారి జమా ఉద్ దావా చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్ ఇంటికి సమీపంలోనే ఈ పేలుడు ఘటన జరిగింది. లాహోర్ లోని జోహార్ టౌన్ లో జరిగిన ఈ ఘటన స్థానికులను వణికించింది. గ్యాస్ పైప్ లైన్ వల్ల ఇది జరిగిందా లేక సిలిండర్ పేలిందా అన్నది ఇంకా నిర్ధారించుకోవలసి ఉందని పోలీసులు అంటున్నారు. ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ళు, భవనాల కిటికీల అద్దాలు నాశనమయ్యాయి. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించారు.

గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని నగర డిప్యూటీ కమిషనర్ రియాజ్ మాలిక్ తెలిపారు. పేలుడు తీవ్రతకు అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడిందని ఆయన చెప్పారు. పేలుడుకు కారణాలు తెలియలేదని…దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు. పంజాబ్ ప్రావిన్స్ ఎమర్జెన్సీకి చెందిన బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ఈ పేలుడుకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మాన్ బజ్ దూర్ డిమాండ్ చేశారు. జోహార్ టౌన్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెంటనే నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. కాగా ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో ఈ పేలుడు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతని శతృవులు ఎవరైనా అతడిని టార్గెట్ చేశారా అన్న కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Tiger Viral Video : పెద్దపులితో ఆటలు…మెడకు తాడుతో, తోకలాగుతూ ఇలా..వైరల్ అవుతున్న వీడియో.

నా రాజకీయాలు వారికి అసహ్యంగా అనిపించాయి.స్టార్ యాక్టర్ ఆర్నాల్డ్ ష్వాజ్‏నెగ్గర్ ఆవేదన..:

విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీకైన ఫాస్ట్ & ఫ్యూరియస్ 9..!ఆగని పైరసీ :Fast & Furious 9 leaked video.

Rakul Preet Singh : క్లిక్స్ కోసం ఎలాంటి హెడ్డింగ్స్ అయినా పెట్టేస్తారా..?ఫైర్ అవుతున్న రకుల్ ప్రీత్.

ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.