పూంచ్‌ జిల్లా సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్‌

పూంచ్‌ జిల్లా సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్‌

పాకిస్థాన్ మళ్లీ తన వక్రబుద్దికి పనిచెప్తోంది. మంగళవారం నాడు.. కొత్త మ్యాప్‌ విడుదల చేసి మరో వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఈ విషయం అలా ఉండగానే.. మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 06, 2020 | 1:23 AM

పాకిస్థాన్ మళ్లీ తన వక్రబుద్దికి పనిచెప్తోంది. మంగళవారం నాడు.. కొత్త మ్యాప్‌ విడుదల చేసి మరో వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఈ విషయం అలా ఉండగానే.. మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. పూంచ్‌ జిల్లాలోని మన్‌కోటే సెక్టార్‌ మీదుగా కాల్పులకు తెగబడింది. బుధవారం రాత్రి 7.00 గంటల ప్రాంతంలో చిన్న ఆయుధాలు, మోర్టార్‌ షెల్స్‌ ప్రయోగిస్తూ కాల్పులకు దిగింది. ఈ విషయాన్ని భారత ఆర్మీ తెలిపింది. పాక్‌ కాల్పులకు ధీటుగా ఎదురు సమాధానం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, గత కొద్ది రోజులుగా నిత్యం సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు దిగుతోంది. ఈ ఘటనలో పలువురు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు.

Read More :

ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు

సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu