సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు

పాకిస్థాన్‌ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. గురవారం నాడు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడుతోంది. పూంచ్‌ జిల్లాలోని..

  • Publish Date - 2:23 pm, Thu, 2 July 20 Edited By:
సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు

పాకిస్థాన్‌ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. గురవారం నాడు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడుతోంది. పూంచ్‌ జిల్లాలోని శాహ్పూర్‌, కెరాన్‌ సెక్టార్‌ల మీదుగా కాల్పులకు దిగింది. గురువారం ఉదయం 9.30 గంటలకు కాల్పులకు దిగినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. చిన్న చిన్న
ఆయుధాలను ఉపయోగిస్తూ దాడులకు దిగినట్లు గుర్తించారు. అందుకు ధీటుగా భారత ఆర్మీ కూడా బదులిచ్చింది.

కాగా, గత కొద్ది రోజులుగా నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తోంది. ఓ వైపు ఉగ్రవాదుల్ని దేశంలోకి చొరబడేలా చేస్తూ.. మరో వైపు సరిహద్దుల వెంట కాల్పులకు దిగుతోంది.