పాకిస్తాన్‌లో మతం మారిన సిక్కు యువతి

పాకిస్తాన్‌లో మతం మారిన సిక్కు యువతి

పాకిస్తాన్‌లో ఓ సిక్కు యువతి ముస్లిం యువకుడిని పెళ్లిచేసుకోవడం వైరల్‌గా మారింది. అయితే తమ కుమార్తెను బలవంతంగా మతమార్పిడి చేయించి బలవంతంగా వివాహం చేశారని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే పాకిస్తాన్‌లో మైనార్టీ వర్గమైన సిక్కు మతానికి చెందిన పూజారి కుమార్తెను పాకిస్తాన్ ముస్లిం మతానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడు. అయితే తమ తల్లిదండ్రులు చెప్పిన దాంట్లో నిజం లేదని, తాను ఇష్టపూర్వకంగానే ఆ యువకుడిని వివాహం చేసుకున్నట్టు యువతి ఓ వీడియో సందేశాన్ని […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 30, 2019 | 7:22 PM

పాకిస్తాన్‌లో ఓ సిక్కు యువతి ముస్లిం యువకుడిని పెళ్లిచేసుకోవడం వైరల్‌గా మారింది. అయితే తమ కుమార్తెను బలవంతంగా మతమార్పిడి చేయించి బలవంతంగా వివాహం చేశారని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే పాకిస్తాన్‌లో మైనార్టీ వర్గమైన సిక్కు మతానికి చెందిన పూజారి కుమార్తెను పాకిస్తాన్ ముస్లిం మతానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడు. అయితే తమ తల్లిదండ్రులు చెప్పిన దాంట్లో నిజం లేదని, తాను ఇష్టపూర్వకంగానే ఆ యువకుడిని వివాహం చేసుకున్నట్టు యువతి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పాకిస్తాన్ లాహోర్‌కు చెందిన నంకానా సాహెబ్‌లోని సిక్కు పూజారి తన కుమార్తె జగ్జీత్ కౌర్ కనిపించడం లేదని అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే శుక్రవారం ఆ యువతి మాట్లాడిన ఓ వీడియో బయట హల్‌చల్ చేసింది. తన పేరు జగ్జీత్ కౌర్ అని తాను ఇష్టపడి, ప్రేమించి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్నట్టు చెప్పింది. అయితే ఈ విషయంపై పాకిస్తాన్‌లో గల పంజాబ్ ముఖ్యమంత్రి సర్దార్ ఉస్మాన్ బుజ్డార్ విచారణకు ఆదేశించారు. అదే విధంగా పంజాబ్( భారత్) ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu