Maoist: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 700 మంది లొంగుబాటు..

ఇదే ప్రాంతానికి చెందిన 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు శనివారం బీఎ్‌సఎ్‌ఫ, మల్కన్‌గిరి పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయినవారిలో 300 మంది వివిధ గ్రామాలకు చెందిన మిలీషియా సభ్యులు కూడా..

Maoist: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 700 మంది లొంగుబాటు..
Naxals Supporters
Follow us

|

Updated on: Sep 18, 2022 | 10:37 AM

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయి స్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇదే ప్రాంతానికి చెందిన 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు శనివారం బీఎ్‌సఎ్‌ఫ, మల్కన్‌గిరి పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయినవారిలో 300 మంది వివిధ గ్రామాలకు చెందిన మిలీషియా సభ్యులు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగ్‌పుట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని పదల్‌పుట్‌, కుసుంపుట్‌, మటంపుట్‌, జోదిగుమ్మ గ్రామాల మిలీషియా సభ్యులతోపాటు, ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా భజగుడ, బైసెగుడ, ఖల్‌గుడ, పట్రపుట్‌, వందేపదర్‌, సంబల్‌పూర్‌, సింధిపుట్‌ గ్రామాలకు చెందిన మిలీషియా సభ్యులు ఉన్నారు.

కోరాపుట్‌ డీఐజీ రాజేశ్‌ పండిట్‌, బీఎ్‌సఎఫ్‌ డీఐజీ మదన్‌లాల్‌, మల్కన్‌గిరి ఎస్పీ నితేశ్‌ వద్వని, 65వ బెటాలియన్‌ సీవో టీఎస్‌ రెడ్డి సమక్షంలో వీరంతా లొంగిపోయారు. అనంతరం మావోయిస్టుల అరాచకాలపై మండిపడ్డారు. మావోయిస్టులు వీరికి ఇచ్చిన డ్రెస్సులను దహనం చేశారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అభివృద్ధికి మావోయిస్టులు అడ్డంకిగా మారుతున్నారని మండిపడ్డారు.

ఏవోబీ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాము జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లుగా తెలిపారు. గతనెల 22న 550 మంది, జూన్‌ 11న 347 మంది, జూన్‌ 2న 50 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయని పోలీసులు తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిశారని పోలీసులు అభినందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం