ఢిల్లీ అల్లర్లలో పంజాబ్ కు చెందిన 100 మంది రైతుల మిస్సింగ్, మానవ హక్కుల సంఘం ఫిర్యాదు

ఈ నెల 26 న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన అల్లర్లు, ఘర్షణల్లో తమ రాష్ట్రానికి చెందిన 100 మంది అన్నదాతల జాడ కనిపించడంలేదని...

ఢిల్లీ అల్లర్లలో పంజాబ్ కు చెందిన 100 మంది రైతుల మిస్సింగ్, మానవ హక్కుల సంఘం ఫిర్యాదు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 30, 2021 | 7:46 PM

ఈ నెల 26 న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన అల్లర్లు, ఘర్షణల్లో తమ రాష్ట్రానికి చెందిన 100 మంది అన్నదాతల జాడ కనిపించడంలేదని ఈ రాష్ట్ర మానవ హక్కుల సంఘం తెలిపింది. వీరంతా పంజాబ్ లోని వివిధ గ్రామాలకు చెందినవారని వెల్లడించింది. వీరిని పోలీసులు అరెస్టు చేశారో లేదో తెలియడంలేదని, ఢిల్లీ అధికారులు వీరి జాడను కనుగొనేందుకు యత్నించాలని ఈ సంఘం కోరింది. ఈ అన్నదాతల్లో కొందరు ఈ నెల 23 న రెండు ట్రాక్టర్లలో ఢిల్లీకి బయలుదేరారు. ఇలా ఉండగా ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ, ఖల్సా మిషన్ వంటి స్వఛ్చంద సంస్థలు వీరికి  ఉచితంగా లీగల్ ఎయిడ్ కల్పించేందుకు ముందుకు వచ్చాయి. పోలీసులు అరెస్ట్ చేసినవారిని విడిపించేందుకు తాము ఎలాంటి ఫీజు తీసుకోకుండా కోర్టుల్లో వాదిస్తామని హామీనిచ్చాయి. ఇప్పటికే కొంతమంది రైతులపై పోలీసులు కేసులు పెట్టి  నగరంలోని వివిధ జైళ్లకు పంపారు.

కాగా తప్పిపోయిన వారి లిస్టును పంపాలని సంయుక్త కిసాన్ మోర్చా, భారతీయ కిసాన్ యూనియన్ వంటి రైతు సంఘాలు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన ఎంజీవోలను కోరాయి. జాప్యం చేయకుండా పంపిన పక్షంలో తాము  ఈ విషయంలో సాయపడతామని పేర్కొన్నాయి.

Read More:వరుడు కావలెను అంటోన్న రీతు వర్మ, నాగశౌర్య ఆమెకు సరితూగుతాడా..ఈ వీడియో చూసి చెప్పండి.

Read More:తెలంగాణ ఎంసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. చివరి విడత కౌన్సెలింగ్‌ ఎప్పుడో తెలుసా..