Pegasus spyware:పెగాసస్‌‌పై న్యూయార్క్ టైమ్స్‌లో కథనాలు.. మరోసారి మోడీ సర్కార్‌ను టార్గెట్ చేసిన విపక్షం

దేశంలో పెగాసస్‌ ఇష్యూ సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కాంగ్రెస్‌ దుమ్మెత్తి పోస్తుంటే.. బీజేపీ సైతం గట్టి కౌంటర్‌ ఇస్తోంది. కాంగ్రెస్‌ మాటలు.. సుపారీ వ్యాఖ్యల్లా ఉన్నాయంటూ కేంద్ర మంత్రులు నఖ్వీ, కిరణ్‌ రిజిజు మండిపడ్డారు.

Pegasus spyware:పెగాసస్‌‌పై న్యూయార్క్ టైమ్స్‌లో కథనాలు.. మరోసారి మోడీ సర్కార్‌ను టార్గెట్ చేసిన విపక్షం
Pegasus Spyware
Follow us

|

Updated on: Jan 30, 2022 | 10:28 AM

Pegasus spyware purchase Controversy: దేశంలో పెగాసస్‌(Pegasus) ఇష్యూ సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం(Union Government)పై విపక్ష కాంగ్రెస్‌ దుమ్మెత్తి పోస్తుంటే.. బీజేపీ సైతం గట్టి కౌంటర్‌ ఇస్తోంది. కాంగ్రెస్‌ మాటలు.. సుపారీ వ్యాఖ్యల్లా ఉన్నాయంటూ కేంద్ర మంత్రులు నఖ్వీ, కిరణ్‌ రిజిజు మండిపడ్డారు. పౌరులపై లక్ష్యంగా నిఘా పెట్టేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ(Congress).. మరోసారి మోడీ(PM Modi) సర్కార్‌ను టార్గెట్ చేసింది. జూలై 2017లో ఇజ్రాయెలీ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌కు చెందిన పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ చేసిన దర్యాప్తుపై కొత్త రాజకీయ తుఫాను చెలరేగింది..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్‌ను భారత్‌ 2017లోనే ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసినట్లు తాజాగా న్యూయార్స్ టైమ్స్ సంచలన కథనం వెల్లడించింది. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలను పెంచాయి. స్పైవేర్‌ను వాడి అక్రమంగా నిఘా పెట్టడం దేశద్రోహం అంటూ కేంద్రంపై దాడి చేశాయి. దీనిపై కేంద్రం మంత్రులు సైతం గట్టి కౌంటర్‌ ఇచ్చారు. దృఢమైన, విస్తారమైన భారత ప్రజాస్వామ్యానికి ఇతరుల ధ్రువపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

అయితే,పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు కేవలం రెండు రోజుల ముందు వెల్లడైన అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలకు సరికొత్త అందినట్లు అయ్యింది. NYT నివేదిక ప్రచురించిన తర్వాత శనివారం నాడు ఈ అంశంపై పార్లమెంటును,సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై దాడి చేశాయి , అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పాత్రికేయులు, స్పైవేర్‌లను ఉపయోగించినట్లు ఆరోపించింది. ఇది ముమ్మాటికి దేశద్రోహ చర్య అని, రాబోయే బడ్జెట్ సెషన్‌లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతామని విపక్ష పార్టీ నేతలు చెప్పారు.

హిందూ జాతీయవాదం ప్రబలుతున్న భారతదేశంలో అసహనం, అభద్రత పెరుగుతున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, అమెరికా చట్టసభల ప్రతినిధులు కొందరు వ్యక్తం చేసిన ఆందోళనకు కేంద్ర మంత్రిత్వశాఖ దీటుగా స్పందించింది. ఇండియన్‌ అమెరికన్‌ ముస్లిం కౌన్సిల్‌ గత బుధవారం వర్చువల్‌గా ఏర్పాటు చేసిన సదస్సులో హమీద్‌ అన్సారీతో పాటు మరికొందరు.. పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి స్పందించారు. సదస్సు వివరాలు తెలుసుకున్నామని.. వక్తల పక్షపాత ధోరణి, రాజకీయ ప్రయోజనాలు కనిపిస్తూనే ఉన్నాయన్నారు.

మన రాజ్యాంగాన్ని రక్షించాలని ఇతరులు గళమెత్తడం అసంబద్ధం, .. విపరీత ధోరణి అని అన్నారు. హమీద్‌ అన్సారీ అభిప్రాయం తప్పని.. మైనార్టీలకు ఇంతకంటే సురక్షితమైన దేశం ఎక్కడైనా ఉంటే చెప్పాలని సవాల్‌ విసిరారు. ఇరుగు పొరుగు దేశాల మైనార్టీలు కూడా రక్షణ కోరి భారత్‌లోకి వస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ట్వీట్‌ చేశారు. కొంతమంది వ్యక్తులు, సంస్థలు భారత వ్యతిరేక ప్రచారానికి సుపారీ’ తీసుకొన్నట్లుగా ఉందని ఆరోపించారు.

Read Also…. Indian Mint: మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు..

ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు