Online Loan Apps: ఆన్‌లైన్ యాప్‌ల‌పై పోలీసుల ద‌ర్యాప్తు ముమ్మ‌రం.. యాప్‌ల సూత్ర‌ధారులు విదేశాల్లో..

Online Loan Apps:ఈ మ‌ధ్య కాలంలో ఆన్ లైన్ యాప్‌లు చాలా పెరిగిపోయాయి. ఆన్ లైన్ యాప్‌ల ద్వారా రుణాలు ఇస్తూ బాధితుల‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నారు. వేధింపులు...

Online Loan Apps: ఆన్‌లైన్ యాప్‌ల‌పై పోలీసుల ద‌ర్యాప్తు ముమ్మ‌రం.. యాప్‌ల సూత్ర‌ధారులు విదేశాల్లో..
Follow us

|

Updated on: Jan 01, 2021 | 3:35 PM

Online Loan Apps:ఈ మ‌ధ్య కాలంలో ఆన్ లైన్ యాప్‌లు చాలా పెరిగిపోయాయి. ఆన్ లైన్ యాప్‌ల ద్వారా రుణాలు ఇస్తూ బాధితుల‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నారు. వేధింపులు ఎక్కువై పోవ‌డంతో బాధితులు పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. దీంతో కేసులు న‌మోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి యాప్‌ల‌ను న‌డిపిస్తున్న‌ వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు. వాయిదాల‌ ప‌ద్ద‌తిలో రుణాలు మంజూరు చేస్తూ లోన్ యాప్ కేసులో ప్ర‌ధాన నిందితులు విదేశాల్లో త‌ల‌దాచుకుంటున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుల్లో నాలుగు క‌మిష‌న‌రేట్ల ప‌రిధిల్లో అరెస్టు అయిన వారి విచార‌ణ‌లో ప్ర‌ధాన సూత్ర‌ధారులు మ‌లేషియా, సింగ‌పూర్‌, ఇంగ్లండ్ త‌దిత‌ర దేశాల్లో త‌ల‌దాచుకుంటున్న‌ట్లు తేలింది. ఇప్ప‌టికే వ‌రంగ‌ల్‌, రాచ‌కొండ‌, సైబ‌రాబాద్ పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు చైనా దేశీయులు ల్యాంబో, జియాంగ్, ఇయాన్ ఎబెయ్ అలియాస్ డెన్నీస్ స‌హా మొత్తం 30 మంది కేవ‌లం పాత్ర దారులేన‌ని పోలీసులు గుర్తించారు. ల్యాంబోను విచారించ‌గా, ఈ రుణాల యాప్ వెనుక యువాన్ అనే చైనీయుడు ఉన్న‌ట్లు తేలింది.

ల్యాంబోను అరెస్టు చేయడంలో రాచ‌కొండ పోలీసులు కొంత ఆల‌స్యం చేసి ఉంటే అత‌డు చైనాకు పారిపోయేవాడు. హైద‌రాబాద్ లోని మూడు కాల్ సెంట‌ర్లు, బెంగ‌ళూరు, గురుగ్రామ్ ల‌లో ని ఒక్కో కాల్ సెంట‌ర్ కు చీఫ్ వ్య‌వ‌హ‌రిస్తున్న ల్యాంబో.. చైనాకు పారిపోయేందుకు ప్ర‌య‌త్నంచాడు. విమానం ఎక్కేందుకు ప్ర‌య‌త్నిస్తున్న క్ర‌మంలో రాచ‌కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా త‌న‌కేమి తెలియ‌ద‌ని బుకాయించినా.. విచార‌ణ త‌ర్వాత అస‌లు విష‌యాలు బయటపెట్టాడు. అత‌ను భార‌త్ కాల్ సెంట‌ర్ల‌కు హెడ్ అని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. అంతేకాకుండా వీడియో కాన్ఫ‌రెన్స్‌ల ద్వారా చైనాలోని ప్ర‌ధాన నిందితులు, ఇక్క‌డ కాల్ సెంట‌ర్ల‌లో రిక్రూట్ చేసుకున్న సిబ్బందికి శిక్ష‌ణ ఇచ్చేవార‌ని పోలీసుల విచార‌ణ‌లో ల్యాంబో వెల్ల‌డించాడు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చైనాలోని ప్రధాన నిందితులు.. ఇక్కడ కాల్‌ సెంటర్లలో రిక్రూట్‌ చేసుకున్న సిబ్బందికి శిక్షణ ఇచ్చేవారని పోలీసుల విచారణలో ల్యాంబో వెళ్లడించాడు. వాయిదా ప‌ద్ద‌తుల్లో లోన్ తీసుకుని, తిరిగి చెల్లించ‌ని వారి ఫోన్ల‌లో ఉన్న కాంటాక్టుల‌ను ఎలా గుర్తించాలి..? వారి బంధు, మిత్రుల‌ను ఎలా వేధించాలి? అధిక వ‌డ్డీపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి? అనే అంశాల్లో ఇక్క‌డి పాత్ర‌ధారులకు శిక్ష‌ణ ఇచ్చేవార‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలిన‌ట్లు స‌మాచారం. పోలీసులు విచారణ జరుపుతున్న కొద్ది ఈ యాప్‌ల దందాలో రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Also Read: Drunk and Drive: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ డ్రైవ్ తనిఖీలు.. నిన్న ఒక్క రోజే 931 వాహనాలు స్వాధీనం..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన