Online Game Addiction: గంటల తరబడి ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ.. మతిస్థిమితం కోల్పోయిన బాలుడు..

Online Game Addiction: గంటల తరబడి ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ.. మతిస్థిమితం కోల్పోయిన బాలుడు..
Smart Phones

Online Game Addiction: ఆన్‌లైన్ ఫోన్‌ గేమ్‌కు బానిసైన ఓ బాలుడు మతిస్థిమితం కోల్పోయాడు. ఈ ఘటన తమిళనాడులో కలకలం సృష్టించింది. 17 ఏళ్ల విద్యార్థి మానసిక అనారోగ్యానికి గురికావడంతో

Shaik Madarsaheb

|

Apr 10, 2022 | 8:44 AM

Online Game Addiction: ఆన్‌లైన్ ఫోన్‌ గేమ్‌కు బానిసైన ఓ బాలుడు మతిస్థిమితం కోల్పోయాడు. ఈ ఘటన తమిళనాడులో కలకలం సృష్టించింది. 17 ఏళ్ల విద్యార్థి మానసిక అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు అతన్ని తిరునల్వేలి (Tamil Nadu) ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో బాలుడిని తీసుకోని తల్లిదండ్రులు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై విచారించిన పోలీసులు బాధిత బాలుడు తిరునల్వేలికి చెందిన వాడిగా గుర్తించారు. ఆ తర్వాత ఆసుపత్రి సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. అయితే.. అతను ఆన్‌లైన్ గేమ్‌లకు బానిస కావడం వల్ల మతిస్థిమితం కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడు.. నిత్యం సెల్ ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాడని.. దీనికారణంగా క్రమంగా మానసిక సమస్యలు తలెత్తినట్లు పేర్కొన్నారు. సాధారణ సమయాల్లో సైతం తుపాకీ పట్టుకుని కాల్పులు జరుపుతున్నట్లు వింతగా ప్రవర్తిస్తున్నాడన్నారు.

బాలుడిని అతడి తల్లిదండ్రులు.. ఈ నెల 4న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని తెలిపారు. అయితే.. ఏప్రిల్ 5 తెల్లవారుజామున వైద్యులకు సమాచారమివ్వకుండా తల్లిదండ్రులు బాలుడిని తీసుకోని వెళ్లిపోయారని వైద్యులు తెలిపారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియోను పరిశీలించిన ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేసింది. మొబైల్ ఫోన్‌లో గంటల తరబడి గేమ్‌లు ఆడడం వల్లే అతనికి ఈ మానసిక వ్యాధి సోకిందని వైద్యుల ప్రాథమిక విచారణలో తేలిందని సైకియాట్రిస్ట్ పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. మొబైల్ స్క్రీన్‌ను అదేపనిగా గంటల తరబడి చూస్తూ ఉంటే మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Also Read:

Crime News: ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం..! విషం తాగిన ఆరుగురు బాలికలు.. ముగ్గురు మృతి

AP Cabinet: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నయా టీమ్‌ రెడీ.. 25 మందితో రాజ్‌భవన్‌కు కొత్త జాబితా..

Covid Vaccine Booster: నేటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు.. రూ.225కే టీకా..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu