నాందేడ్.. ఇద్దరు సాధువుల హత్యలో తెలంగాణ వాసి ?

మహారాష్ట్రలోని నాందేడ్ లో ఇద్దరు సాధువుల  హత్య కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిశాయి. ఈ కేసులో సాయినాథ్ శింగాడే అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు అతడు తెలంగాణ ప్రాంతానికి చెందినవాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని తానూర్ పోలీసు స్టేషన్ నుంచి అతడ్ని అరెస్టు చేసి తీసుకుపోయినట్టు చెప్పారు. బాలబ్రహ్మచారి శివాచార్యను, ఆయన శిష్యుడు భగవాన్  షిండే ని.. సాయినాథ్ శింగాడే కేబుల్ వైర్ తో గొంతు బిగించి హతమార్చాడని వారు చెప్పారు. ఇతగాడు  […]

నాందేడ్.. ఇద్దరు సాధువుల హత్యలో తెలంగాణ వాసి ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 24, 2020 | 6:04 PM

మహారాష్ట్రలోని నాందేడ్ లో ఇద్దరు సాధువుల  హత్య కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిశాయి. ఈ కేసులో సాయినాథ్ శింగాడే అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు అతడు తెలంగాణ ప్రాంతానికి చెందినవాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని తానూర్ పోలీసు స్టేషన్ నుంచి అతడ్ని అరెస్టు చేసి తీసుకుపోయినట్టు చెప్పారు. బాలబ్రహ్మచారి శివాచార్యను, ఆయన శిష్యుడు భగవాన్  షిండే ని.. సాయినాథ్ శింగాడే కేబుల్ వైర్ తో గొంతు బిగించి హతమార్చాడని వారు చెప్పారు. ఇతగాడు  సాధువుల ఆశ్రమం నుంచి సుమారు లక్షన్నర విలువైన వస్తువులను అపహరించి పారిపోతూ శివాచార్య డెడ్ బాడీని ఆయనకు చెందిన కారులోనే తరలించి పారిపోతుండగా.. కారు ఆశ్రమ గేటు వద్ద నిలిచి పోవడంతో.. తన సహచరులతో ఓ టూ వీలర్ పై పరారడయ్యాడని తెలిసింది. భగవాన్ షిండే మృతదేహాన్ని బాత్ రూంలో వదిలేశాడని తెలియవచ్చింది. కాగా శింగాడేకి, షిండే కి మధ్య ఇదివరకే పరిచయం ఉన్నట్టు భావిస్తున్నారు. ఆశ్రమానికి సుమారు 750 మీటర్ల దూరం లోని ఓ జెడ్ పీ స్కూలు వద్ద లోగడ వీరు కలుసుకునేవారట.శింగాడే హిస్టరీ షీటర్ అని , పదేళ్ల క్రితం ఓ హత్య కేసులో నిందితుడని పోలీసులు తెలిపారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?