కాశ్మీర్ పై యుఎస్ కమిటీలో రచ్చ.. భారత జర్నలిస్ట్ ఖండన

కాశ్మీర్ సమస్యపై యుఎస్ కాంగ్రెస్ రచ్చ చేస్తోందని సీనియర్ జర్నలిస్ట్ ఆర్తీ టికూసింగ్ ఆరోపించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరుపుతున్న దాడుల వల్ల కాశ్మీరీ ముస్లిములు ఎంతో నష్టపోతున్నారని ఆమె అన్నారు. కానీ… దీన్ని పలువురు విదేశీయులు, ప్రపంచ మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కాశ్మీర్ పై యుఎస్ కాంగ్రెస్ కమిటీ ‘ విచారణ ‘ జరుపుతున్న సంగతి విదితమే. ఈ తంతు పక్షపాతపూరితంగా ఉందని, ఇండియాకు వ్యతిరేకంగా, పాకిస్థాన్ కు అనుకూలంగా ఉందని టికూసింగ్ […]

కాశ్మీర్ పై యుఎస్ కమిటీలో రచ్చ.. భారత జర్నలిస్ట్ ఖండన
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 23, 2019 | 5:49 PM

కాశ్మీర్ సమస్యపై యుఎస్ కాంగ్రెస్ రచ్చ చేస్తోందని సీనియర్ జర్నలిస్ట్ ఆర్తీ టికూసింగ్ ఆరోపించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరుపుతున్న దాడుల వల్ల కాశ్మీరీ ముస్లిములు ఎంతో నష్టపోతున్నారని ఆమె అన్నారు. కానీ… దీన్ని పలువురు విదేశీయులు, ప్రపంచ మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కాశ్మీర్ పై యుఎస్ కాంగ్రెస్ కమిటీ ‘ విచారణ ‘ జరుపుతున్న సంగతి విదితమే. ఈ తంతు పక్షపాతపూరితంగా ఉందని, ఇండియాకు వ్యతిరేకంగా, పాకిస్థాన్ కు అనుకూలంగా ఉందని టికూసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ దక్షిణాసియాలో మానవ హక్కులు ‘ అన్న అంశంపై యుఎస్ హౌస్ ఫారిన్ ఎఫైర్స్ కమిటీ వాషింగ్టన్ లో నిర్వహించిన విచారణలో ఆమె తన వాంగ్మూలమిచ్చారు.

కాశ్మీర్ రాష్ట్రంలో 30 ఏళ్లుగా ఇస్లామిక్ జిహాద్ కొనసాగుతోందని, పాక్ ప్రోత్సాహంతో టెర్రరిస్టులు విజృంభిస్తున్నా ప్రపంచ మీడియా దీన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆమె అన్నారు. (కాశ్మీర్ అంశంపై మాట్లాడాలని ప్రభుత్వం ఈమెను నామినేట్ చేసింది). అయితే యుఎస్ కాంగ్రెస్ సభ్యురాలైన ఇల్హన్ ఉమర్.. టికూసింగ్ తో విభేదిస్తూ.. ఆమె అర్థరహితమైన వాదన చేస్తోందని విమర్శించారు. జర్నలిస్టుల ‘ జాబ్ ‘ అన్నది నిజాన్ని ఖఛ్చితంగా తెలుసుకుని ప్రజలకు దాన్ని వివరించడమేనని ఆమె వ్యాఖ్యానించింది. కాశ్మీర్లో అణచివేత మానవహక్కులకు మంచిదే అన్న రీతిలో మీ ప్రసంగం ఉందని ఇల్హన్ సెటైర్లు వేసింది. ఈ వ్యాఖ్యలను టికూసింగ్ ఖండిస్తూ.. గత 20 ఏళ్లుగా తాను జర్నలిజం వృత్తిలో ఉన్నానని, ఎవరిపట్లా పక్షపాతం చూపాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు. కాశ్మీర్ లోని వాస్తవ పరిస్థితులపై వాల్డ్ మీడియా వక్రీకరించడమే తనను బాధిస్తోందని ఆమె అన్నారు. గత ఏడాది ఆ రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్ట్ షుజాత్ బుఖారీ దారుణ హత్యను ఆమె గుర్తు చేశారు. భారత-పాకిస్తాన్ దేశాల మధ్య చర్చలు జరిగి శాంతి నెలకొనాలని బుఖారీ భావించేవారని ఆమె అన్నారు. ఇదే విషయమై ఆయన ప్రపంచంలోని పలు నగరాలను చుట్టి వచ్చారని, అయితే 2018 జూన్ 14 న బుఖారీని శ్రీనగర్ లోని ఆయన కార్యాలయం వద్దే లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారని టికూసింగ్ పేర్కొన్నారు. ఇదే సంస్థ 2008 లో ముంబైలో దారుణ పేలుళ్లకు పాల్పడితే అమెరికా ఈ సంస్థను నిషేధించిందని ఆమె తెలిపారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.