Viral News: విడాకులు తీసుకున్న భార్యను అత్యంత అమానుషంగా హతమార్చాడు మాజీ భర్త. మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న భార్య చేతులు కట్టేసిన భర్త.. నలుగురితో కలిసి అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుంచి కిందకు విసిరేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో 30 ఏళ్ల మహిళను ఆమె మాజీ భర్త, మరో నలుగురు కలిసి తన ఇంటి నాల్గవ అంతస్తు బాల్కనీ నుండి విసిరివేయడంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు మహిళ భర్త ఆకాష్ గౌతమ్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసి.. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 302 (హత్య), 34 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రితికా సింగ్ అనే మహిళ తన భర్త నుండి విడిపోయిన తర్వాత ఫేస్బుక్లో పరిచయమైన స్నేహితుడితో తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక ఇంట్లో నివసిస్తోంది. రితికా సింగ్ తన స్నేహితుడు విపుల్ అగర్వాల్‌తో కలిసి తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా మేవతిలోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ దారుణ ఘటన శుక్రవారం ఉదయం 11 గంటలకు జరిగింది.” ఆగ్రా
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP)..సుధీర్ కుమార్ సింగ్ .. మాట్లాడుతూ.. రితిక ఘజియాబాద్ నివాసి అని.. ఫిరోజాబాద్ నివాసి ఆకాష్ గౌతమ్‌ను 2014లో వివాహం చేసుకున్నారని.. ఈ భార్యాభర్తలు 2018లో విడిపోయారని తెలిపారు. అయితే తన మాజీ భార్య మరో వ్యక్తితో కలిసి ఉంటుందని ఆకాష్ గౌతమ్ కు తెలియడంతో.. “శుక్రవారం.. ఆకాష్ గౌతమ్ ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులతో కలిసి అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అక్కడ వారు రితికా, విపుల్ అగర్వాల్‌తో వాగ్వాదానికి దిగారు. తరువాత వారిద్దరిపై దాడి చేశారు.. దీంతో విపుల్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు
మిస్టర్ అగర్వాల్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. తాళ్లతో వారిద్దరి చేతులు కట్టేశారు. విపుల్‌ను బాత్రూమ్లో బంధించారు. అనంతరం నాలుగో అంతస్తులో ఉన్న అపార్ట్మెంట్ బాల్కానీ నుంచి రితికాను కిందకు విసిరేశారు. కింద పడిన ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అగర్వాల్ బాత్రూమ్ కిటికీ నుండి సహాయం కోసం అరవడంతో.. నిందితులు అక్కడ నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. రితికా మాజీ భర్తతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఐపిసి సెక్షన్ 302, 34 కింద ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఎస్పీ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..