Crime News: ఓటీపీ చెప్పలేదని ప్రాణం తీశాడు.. ప్యాసింజర్‌ను దారుణంగా కొట్టి చంపిన ట్యాక్సీ డ్రైవర్..

గూడువాంచేరి సమీపం కన్నివాక్కం కుందన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఉమేందర్‌ (34).. కోయంబత్తూరులోని ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

Crime News: ఓటీపీ చెప్పలేదని ప్రాణం తీశాడు.. ప్యాసింజర్‌ను దారుణంగా కొట్టి చంపిన ట్యాక్సీ డ్రైవర్..
Taxi
Follow us

|

Updated on: Jul 05, 2022 | 5:23 PM

Ola cab driver kills techie: తమిళనాడు చెన్నైలోని ఓల్డ్ మహాబలిపురం ముట్టుకాడు ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణహత్యకు గురయ్యాడు. టాక్సీ కారు ఓటీపీ విషయమై జరిగిన వివాదంతో ఆ వ్యక్తిని కారు డ్రైవర్ అత్యంత పాశవికంగా హతమార్చాడు. గూడువాంచేరి సమీపం కన్నివాక్కం కుందన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఉమేందర్‌ (34).. కోయంబత్తూరులోని ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వారంతపు సెలవుల్లో కుటుంబసభ్యులతో కలిసి గూడువాంచేరి వచ్చాడు. సాయంత్రం నవులూరులోని ఓ మాల్ నుంచి కుటుంబసభ్యులతో కలిసి గూడువాంచెరి వెళ్లేందుకు ఓలా టాక్సీని బుక్‌ చేసుకున్నారు. భార్య భవ్య కారు బుక్ చేసింది. కాసేపట్లో అక్కడికి వచ్చిన అద్దె కారులో కుటుంబసభ్యులతో కలిసి ఎక్కారు. ఆ సందర్భంగా కారు డ్రైవర్‌ రవి పాస్‌వర్డ్‌ చెప్పి.. ఎక్కాలని.. ఉమేందర్ కుటుంబసభ్యులకు సూచించాడు. అంతేకాకుండా ఏడుగురు ఉన్నారు.. పెద్ద కారు బుక్ చేసుకోవాలంటూ సూచించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటచేసుకుంది. ఉమేందర్‌ సహా కుటుంబీకులు కారు నుండి దిగిపోయారు.

దీంతో ఆగ్రహంతో టాక్సీ డ్రైవర్ ఉమేందర్‌పై దాడి చేశాడు. బలమైన వస్తువుతో ఉపేందర్‌ను కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న కేలంబాక్కం పోలీసులు.. కొన ఊపిరితో ఉన్న ఉమేందర్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కారు డ్రైవర్‌ రవిని అరెస్టు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..