Honey Trap: భువనేశ్వర్‌ హనీట్రాప్‌ కేసులో కీలక మలుపు.. బ్యాంక్ ఖాతాల వివరాల కోసం ఆర్బీఐకి పోలీసుల లేఖ..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Oct 10, 2022 | 7:06 AM

సొగసైన మాటలతో రాజకీయ నాయకులకే మస్కా కొడుతుంది. సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌ మొదలు పెడుతుంది.

Honey Trap: భువనేశ్వర్‌ హనీట్రాప్‌ కేసులో కీలక మలుపు.. బ్యాంక్ ఖాతాల వివరాల కోసం ఆర్బీఐకి పోలీసుల లేఖ..
Honey Trap

తన అందంతో, సొగసైన మాటలతో రాజకీయ నాయకులకే మస్కా కొడుతుంది. ఆ తరువాత అసలు ప్లాన్‌ అమలు చేస్తుంది. వారితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కి దిగి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేస్తుంది. కొంత కాలంగా రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ మాయలాడిని ఎట్టకేలకు భువనేశ్వర్‌ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. నిందితురానికి భువనేశ్వర్‌లోని సత్య విహార్‌ ప్రాంతానికి చెందిన అర్చన నాగ్ గా గుర్తించారు. ఆమె దగ్గరి నుంచి ఫోన్లు, రెండు పెన్ డ్రైవ్‌లు, డైరీని పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఆమెకు భువనేశ్వర్‌లో ఖరీదైన భవనం ఉంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో సంపన్నులు, ఉన్నతాధికారులతో స్నేహం చేస్తుంది.

తర్వాత మాటలతో ముగ్గులోకి దింపి తన నివాస భవనంలోకి రప్పించుకునేది. వారితో సన్నిహితంగా ఉండి.ఆ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించేది. తర్వాత అడిగినంత ఇవ్వకపోతే ఆ వీడియోలు, ఫొటోలను సోషల్‌మీడియాలో పెడతానని బెదిరిస్తుంది. కొంతమంది పోలీసు అధికారులు కూడా ఆమె వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు బీఎండబ్ల్యూ, ఫోర్డు కార్లున్నాయి. ఓ ఫార్మ్‌ హౌస్‌ కూడా ఉంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

హై-ప్రొఫైల్ కస్టమర్ల పేర్లను మాత్రం ఆమె ఇంతవరకు వెల్లడించలేదు. పలువురు సీనియర్ అధికారులు సైతం ఆమె అరెస్టును గోప్యంగా ఉంచడం చర్చనీయాంశం అయింది. పోలీసులు నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హనీ ట్రాప్ గ్యాంగ్‌లో ఉన్న ఆమె భర్త జగబంధుచంద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు .ఈ ముఠాలో కొందరు మహిళలు ఉన్నారు.

అర్చన నాగ్ దాదాపు 20 మంది హై-ప్రొఫైల్ సెక్స్ వర్కర్లను నియమించుకుంది. ఎల్లప్పుడూ సంపన్న కస్టమర్ల కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ సెక్స్ వర్కర్లు తమ సేవలను అందించే ప్రముఖ వ్యక్తులతో ఫోటోగ్రాఫ్‌లు క్లిక్ చేయాలని ఆమె ఆదేశించింది. తర్వాత ఆ ఫొటోలను ఉపయోగించి వారిని బ్లాక్‌మెయిల్‌ చేసి భారీగా డబ్బులు వసూలు చేసింది.

అర్చన నాగ్‌తో కలిసి పనిచేస్తున్న సెక్స్ వర్కర్ల ఫోటోలు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా వివరాలను కూడా పోలీసులు బయటపెట్టారు. ఆమెను అరెస్టు చేసిన తర్వాత, అర్చన నాగ్ బ్యాంక్ ఖాతాలు మరియు ఫిక్స్‌డ్ డిపాజిట్ల గురించి వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి లేఖ రాశారు.

రాకెట్‌లో ప్రమేయం ఉన్న ఇతరులను గుర్తించడానికి కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఆ మహిళ భర్త జగబంధు చంద్‌ ఆరోగ్యం బాగోలేదన్న కారణంతో ఇంకా ప్రశ్నించాల్సి ఉండగా అతడికి నోటీసులు జారీ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu