Lockdown: కరోనా విజృంభణ.. ఒడిశాలో మే 5 నుంచి 19వ తేదీ వరకు లాక్‌డౌన్‌.. కఠినమైన ఆంక్షలు

Lockdown: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. ఇక కరోనా సెకండ్‌వేవ్‌.

Lockdown: కరోనా విజృంభణ.. ఒడిశాలో మే 5 నుంచి 19వ తేదీ వరకు లాక్‌డౌన్‌.. కఠినమైన ఆంక్షలు
Follow us

|

Updated on: May 02, 2021 | 2:54 PM

Lockdown: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. ఇక కరోనా సెకండ్‌వేవ్‌ వల్ల తీవ్ర ప్రభావానికి గురవుతున్న ఒడిశాలో మే 5 నుంచి మే 19 వరకు 14 రోజులపాటు లాక్ డౌన్ విధించబోతున్నారు. వచ్చే బుధవారం నుంచి రెండు వారాలపాటు లాక్ డౌన్ అమలు అవుతుందని ఒడిశా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యే ఈ లాక్‌డౌన్‌లో ఆరోగ్యం, ఇతర అత్యవసర సేవలకు మాత్రం లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది.

అయితే ఉదయం 7 నుంచి 12 గంటల వరకు ప్రజలు తమ ఇంటికి 500 మీటర్ల దూరం వరకు కూరగాయల వంటి నిత్వావసరాలను తెచ్చుకునేందుకు అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. బార్బర్ షాపులు, బ్యూటీ పార్లర్లు, సినిమాహాళ్లు, మాల్స్, జిమ్స్, క్రీడాకేంద్రాలు, స్విమింగ్ పూల్స్, గుళ్లు మూసి ఉంచుతారు. మతపరమైన సమావేశాలకు ఎలాంటి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రం లోపల, బయటికి బస్సుల రవాణాను అనుమతించరు. వారాంతంలో.. అంటే శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు సమపూర్ణ లాక్‌డౌన్ అమల్లో ఉంటుంని ప్రభుత్వం వెల్లడించింది. ఒడిశాలో కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి.  ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరో వైపు పాజిటివ్‌ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయ. పలు రాష్ట్రాల్లో ఎక్కువగా పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇక మాస్క్‌ ధరించకుండా బయట కనిపించే వారిపై అధికారులు చర్యలు చేపడుతున్నారు అలాంటి వారిపై భారీగా జరిమానా విధిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

India Corona: గడిచిన 24 గంటల్లో దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివ్‌ కేసులు.. పెరిగిన మరణాలు

Indian Covid-19 Variant: భారత్‌లో కొత్త వేరియంట్లతో కరోనా విజృంభణ.. ఈ వేరియంట్ ఎక్కడెక్కడ వ్యాపించిందంటే?