‘యోగీజీ ! అది సరైన యోచన కాదు.’ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ .

దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన తమ రాష్ట్ర వలస కూలీలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తప్పు పట్టారు. వారిని రప్పించేందుకు బస్సులను ఏర్పాటు చేయాలని యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించిన సంగతి విదితమే.

'యోగీజీ ! అది సరైన యోచన కాదు.' కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ .
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 26, 2020 | 12:19 PM

దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన తమ రాష్ట్ర వలస కూలీలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తప్పు పట్టారు. వారిని రప్పించేందుకు బస్సులను ఏర్పాటు చేయాలని యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించిన సంగతి విదితమే. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ తరుణంలో ఈ ఆలోచన గానీ, ఈ ప్రయత్నంగానీ మంచిది కాదని నితిన్ గడ్కరీ సూచించారు. ఈ వలస కార్మికుల్లో ఏ ఒక్కరికి వైరస్ సోకినా అది ఇతరులకు కూడా వ్యాపించి.. మొత్తం స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుందని ఆయన అన్నారు. ఈ వలస జీవులు అనేక ప్రాంతాల్లో ఉంటున్నారని, వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఆయా ప్రాంతాల్లో తలదాచుకున్న వీరు ఇంకా ప్రమాదకర పరిస్థితిని తేవచ్చునని అన్నారు. అందువల్ల లాక్ డౌన్ ముగిసేవరకూ ఎక్కడివారిని అక్కడే ఉంచాలని.. వారికి తగిన షెల్టర్లు,  ఆహార వసతి కల్పించాల్సిన బాధ్యత ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలదేనని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అయితే ఇలా రాష్ట్రానికి చేరుకున్న వారిని 14 రోజుల క్వారంటైన్ కి పంపి.. అన్ని కరోనా టెస్టులు చేశాకే రాష్ట్రంలోకి అనుమతించాలని యోగి ఆదిత్యనాథ్ ఆదేశించిన విషయం గమనార్హం.