Strain Virus: దేశంలో రెండు రోజులుగా నమోదు కాని స్ట్రెయిన్‌ కేసులు.. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేంద్రం

Strain Virus: ఒక వైపు మరోనా వైరస్‌.. మరో వైపు స్ట్రెయిన్‌ వైరస్‌. ముందే కరోనాతో దేశాలు అతలాకుతలం అవుతుంటే ఈ కొత్తరకం కరోనా వైరస్‌ వల్ల మరింత భయాందోళన...

Strain Virus: దేశంలో రెండు రోజులుగా నమోదు కాని స్ట్రెయిన్‌ కేసులు.. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేంద్రం
Follow us

|

Updated on: Jan 18, 2021 | 6:01 PM

Strain Virus: ఒక వైపు మరోనా వైరస్‌.. మరో వైపు స్ట్రెయిన్‌ వైరస్‌. ముందే కరోనాతో దేశాలు అతలాకుతలం అవుతుంటే ఈ కొత్తరకం కరోనా వైరస్‌ వల్ల మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఏడాది కాలం నుంచి కరోనా నుంచి బయటపడకముందే ఈ కొత్త రకం వైరస్‌లో జనాల్లో మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది. యూకేలో మొదలైన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలకు సైతం మెల్లమెల్లగా పాకుతోంది. అయితే భారత్‌లో గత రెండు రోజుల నుంచి ఎలాంటి స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

శనివారం నాటికి భారత్‌లో మొత్తం స్ట్రెయిన్‌ వైరస్‌ కేసుల సంఖ్య 116కు చేరింది. ఆది, సోమవారాల్లో ఎలాంటి కొత్త రకం వైరస్ కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా, బ్రిటన్‌లో ఈ రకం వైరస్‌ వెలుగు చూసిన వెంటనే భారత్‌ అప్రమత్తమైంది. ఆ దేశానికి కొద్ది రోజుల పాటు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఆ తర్వాత జనవరి 8 నుంచి తిరిగి విమాన సేవలు ప్రారంభించినప్పటికీ, యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో కరోనా పాజిటివ్‌ తేలిన వారి రక్త నమూనాలను వైరాలజీ ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. అందులో ఇప్పటి వరకు 116 మందికి స్ట్రెయిన్‌ సోకగా, ప్రస్తుతం వారంతా ఆయా రాష్ట్రాల్లో సింగిల్‌ రూం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఇక వారితో కాంటాక్ట్‌ ఉన్నవారిని గుర్తించే పనిలో ఉంది కేంద్రం.

అయితే రూపాంతరం చెందుతున్న కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌ గడగడలాడిస్తోంది. ప్రస్తుతమున్న వ్యాక్సిన్స్‌ ఈ న్యూ స్ట్రెయిన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బ్రిటన్‌ , దక్షిణ ఆఫ్రికా లో పుట్టిన కొత్త రకం వైరస్‌ లు కాకుండా ఇప్పటివరకు మొత్తం నాలుగు రకాల కరోనా వైరస్‌లు బయటపడినట్లు ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటిచిన విషయం తెలిసిందే.

కాగా, ఈ స్ట్రెయిన్‌ వైరస్‌ వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచిస్తోంది. కరోనా లాగే ఈ కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు పెరగకుండా ఉండేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఈ స్ట్రెయిన్‌ వైరస్‌ విషయంలో దేశంలో అన్ని రాష్ట్రాలను కేంద్రం ఎప్పటికప్పుడు కేంద్రం అప్రమత్తం చేస్తోంది.

Also Read:

Corona Cases India: దేశంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 13,788 పాజిటివ్ కేసులు, 145 మరణాలు..