హిందీ భాషను వ్యతిరేకించేవారు దేశాన్ని ప్రేమించలేరు..!

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం హిందీ భాషపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఈ చర్చ తెరమీదకొచ్చింది. హిందీ భాషని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నట్లు దక్షిణ రాష్ట్రాలనుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారయి. మంగళవారం ఓ సందర్భంలో మాట్లాడుతున్న బిప్లబ్ దేబ్.. జాతీయ భాషను వ్యతిరేకించేవారు భారతీయులు కాదంటూ వ్యాఖ్యలు చేశారు. […]

హిందీ భాషను వ్యతిరేకించేవారు దేశాన్ని ప్రేమించలేరు..!
Follow us

| Edited By:

Updated on: Sep 18, 2019 | 1:03 AM

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం హిందీ భాషపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఈ చర్చ తెరమీదకొచ్చింది. హిందీ భాషని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నట్లు దక్షిణ రాష్ట్రాలనుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారయి.

మంగళవారం ఓ సందర్భంలో మాట్లాడుతున్న బిప్లబ్ దేబ్.. జాతీయ భాషను వ్యతిరేకించేవారు భారతీయులు కాదంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే తాను ఇంగ్లిష్‌కు వ్యతిరేకం కాదని, అదేవిధంగా హిందీని రుద్దడాన్ని సమర్థించడం లేదంటూ వివరించారు. జాతీయ భాషగా హిందీని వ్యతిరేకించేవారు.. దేశాన్ని ప్రేమించలేరని అన్నారు. మన దేశంలో అత్యధికులు మాట్లాడుతూ, అర్థం చేసుకోగలిగిన భాషగా హిందీని సమర్థిస్తానని తెలిపారు. మన దేశాన్ని ఆంగ్లేయులు రెండు వందల ఏళ్ల పాటు పరిపాలించి ఉండకపోతే, దేశంలోని అధికారిక వ్యవహారాల్లో ఇంగ్లిష్ భాష ఉపయోగం ఏమీ ఉండేది కాదన్నారు.

అధికారిక భాషల చట్టం, 1963 ప్రకారం కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటులో హిందీ, ఇంగ్లిష్ అధికార భాషలు. అయితే రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలు ప్రకారం 22 భాషలకు గుర్తింపు ఉంది. సెప్టెంబర్ 14న హిందీ దివస్ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ భారత దేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కోసం ఒక భాష ఉండటం చాలా ముఖ్యమని చెప్పిన విషయం తెలిసిందే.

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!