విచిత్రం.. 50 ఏళ్లుగా ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాని గ్రామం!

ఇప్పుడున్న కాలంలో క్రైమ్ జరగని ప్రాంతమంటూ ఉండటం లేదు. నిత్యం ఏదో ఒక చోట నేరాలు జరుగుతూనే ఉంటాయి. కానీ.. ఓ గ్రామంలో మాత్రం సీన్ రివర్స్. అక్కడ ఇప్పటివరకూ ఒక్క పోలీస్ కేసు..

  • Tv9 Telugu
  • Publish Date - 9:42 am, Fri, 28 February 20
విచిత్రం.. 50 ఏళ్లుగా ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాని గ్రామం!

ఇప్పుడున్న కాలంలో క్రైమ్ జరగని ప్రాంతమంటూ ఉండటం లేదు. నిత్యం ఏదో ఒక చోట నేరాలు జరుగుతూనే ఉంటాయి. కానీ.. ఓ గ్రామంలో మాత్రం సీన్ రివర్స్. అక్కడ ఇప్పటివరకూ ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు. ఇదే ఆ గ్రామం స్పెషల్. ఈ విషయం తెలిసిన ప్రతీవాళ్లూ షాక్ అవ్వక తప్పడం లేదు.

దేశ రాజధాని ఢిల్లీకి వద్ద ఉన్న హర్యానాకు చెందిన జీంద్ జిల్లాలోని రోజ్‌ఖెడా గ్రామస్తులు గొడవలు జరిగితే పోలీస్ స్టేషన్‌లకు వెళ్లరు. పంచాయతీ పెద్దల ద్వారానే తమ సమస్యలను పరిష్కరించుకుంటారు. గడిచిన 50 ఏళ్లలో ఈ గ్రామంలో ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ రణధీర్ సింగ్ మాట్లాడుతూ.. గ్రామంలో గొడవలు జరిగినప్పటికీ, ఎవరూ పోలీస్ స్టేషన్‌లకు వెళ్లరు. పంచాయతీ(పెద్ద మనుషుల) సమక్షంలోనే మా సమస్యలను పరిష్కారం చేసుకుంటామన్నారు. కాగా.. ఈ గ్రామంలో వివిధ కులాలకు చెందిన వారందరూ కలిసి మెలిసి ఉంటామని తెలిపారు.