స్టూడెంట్స్‌కి హ్యాపీ న్యూస్.. ఇక నుంచి ‘నో బ్యాగ్ డే’

విద్యార్థుల చదువు సంగతి పక్కన పెడితే.. వారి బ్యాగులను చూస్తే మాత్రం అందరికీ ఒకటే ప్రశ్న గుర్తొస్తుంది. అంతలా ఏముంది బ్యాగ్‌లో అని..! 'ఎల్‌కేజీ పిల్లల నుంచి మొదలు టెన్త్‌ క్లాస్ పిల్లల'వరకూ..

స్టూడెంట్స్‌కి హ్యాపీ న్యూస్.. ఇక నుంచి 'నో బ్యాగ్ డే'
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 25, 2020 | 5:18 PM

విద్యార్థుల చదువు సంగతి పక్కన పెడితే.. వారి బ్యాగులను చూస్తే మాత్రం అందరికీ ఒకటే ప్రశ్న గుర్తొస్తుంది. అంతలా ఏముంది బ్యాగ్‌లో అని..! ‘ఎల్‌కేజీ పిల్లల నుంచి మొదలు టెన్త్‌ క్లాస్ పిల్లల’వరకూ వారి బ్యాగులను చూస్తే పాపం అనాల్సిందే. తాజాగా ఈ విషయంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మేలు చేసే ఓ నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి విద్యార్థులకు పుస్తకాలను మోసే బరువును తగ్గించాలనుకుంది. అలాగే ప్రతీ శనివారం రాజస్థాన్ ప్రభుత్వ స్కూళ్లలో పాఠాలు చెప్పరు.

ఆ రోజంతా పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, స్కౌట్, పర్సనాల్టీ డెవలప్‌మెంట్ వంటి కార్యక్రమాలు ఉంటాయి. అలాగే.. టీచర్స్‌తో స్టూడెంట్ పేరెంట్స్ మీటింగ్స్ కూడా ఉంటాయి. అయితే ఈ వార్త విన్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే.. ఉద్యోగాలకు వెళ్లే పేరెంట్స్ ప్రతీ శనివారం స్కూల్‌కి ఎలా హాజరవుతారని ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

తాజాగా ఇదే విషయంపై అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేస్తూ ఈ కొత్త నిర్ణయాన్ని ప్రకటించారు. పిల్లలకు చదువుతో పాటు.. ఆట, పాటలు, క్రీడా నైపుణ్యం ముఖ్యమన్నారు. వీటితో శరీర ధృడత్వం, ఆరోగ్యం రెండూ అవసరమన్నారు. అలాగే.. ప్రతీ శనివారం పేరెంట్స్‌ మీటింగ్ ఎంతో ముఖ్యమన్నారు.