AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Nitish Kumar: బిహార్‎లో కొత్త ప్రభుత్వం.. 9వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్..

బిహార్‎లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే బిహార్ సీఎంగా నితీష్ కుమార్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో బీజేపీ, జేడీయూతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. నితీష్‎తో పాటు డిప్యూటీ సీఎంగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరూ బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు. దీంతో తొమ్మిదవ సారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొత్త రికార్డును సృష్టించారు.

CM Nitish Kumar: బిహార్‎లో కొత్త ప్రభుత్వం.. 9వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్..
Cm Nitish Kumar
Srikar T
|

Updated on: Jan 28, 2024 | 5:53 PM

Share

బిహార్‎లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే బిహార్ సీఎంగా నితీష్ కుమార్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో బీజేపీ, జేడీయూతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. నితీష్‎తో పాటు డిప్యూటీ సీఎంగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరూ బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు. దీంతో తొమ్మిదవ సారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొత్త రికార్డును సృష్టించారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది మంత్రులు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, హిందుస్థాన్ ఆవామ్ మోర్చా నుంచి ఇద్దరు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేశారు.

బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్న సామ్రాట్ చౌదరి ఉపముఖ్యమంత్రిగా నియమించబడ్డారు. అలాగే విజయ్ కుమార్ సిన్హా, డా. ప్రేమ్ కుమార్ లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, విజయేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రవణ్ కుమార్ మంత్రులుగా ఎంపికయ్యారు. హిందుస్థాన్ ఆవామ్ మోర్చా నుంచి సంతోష్ కుమార్, సుమన్‌కు కేబినెట్ బెర్త్ దక్కింది. నితీశ్ ప్రమాణ స్వీకారానికి బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్ భవన్‎లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కు లేఖ సమర్పించిన తర్వాత బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మహాగఢ్ బంధన్ కూటమి నుంచి వైదొలగి ఎన్డీయేతో చేతులు కలిపారు నితీష్ కుమార్.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us