Nitish Kumar: బీజేపీని గద్దె దింపేందుకు విపక్షాలన్నీ ఒకే ఫ్రంట్‌గా పోరాడాలని నితీష్‌ కుమార్ పిలుపు.. హర్యానా లోని ఫతేబాద్‌లో విపక్ష నేతల వ్యూహం..

Devi Lal Birth Anniversary: విపక్షాలు ఐక్యంగా పోరాడితే 2024లో బీజేపీ గద్దె దిగడం ఖాయమన్నారు నితీష్‌కుమార్‌. బీజేపీపై ఈ సమావేశంలో నిప్పులు చెరిగారు నితీష్‌. అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్ధుల ఓటమి వెనుక బీజేపీ కుట్ర ఉందన్నారు. బీహార్‌కు..

Nitish Kumar: బీజేపీని గద్దె దింపేందుకు విపక్షాలన్నీ ఒకే ఫ్రంట్‌గా పోరాడాలని నితీష్‌ కుమార్ పిలుపు.. హర్యానా లోని ఫతేబాద్‌లో విపక్ష నేతల వ్యూహం..
Samman Diwas Rally
Follow us

|

Updated on: Sep 25, 2022 | 7:48 PM

2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేయాలని విపక్ష నేతలు నిర్ణయించారు. హర్యానా లోని ఫతేబాద్‌లో జరిగిన మాజీ ఉపప్రధాని దేవీలాల్‌ జయంతి వేడులకు విపక్షాల ఐక్యతకు వేదికగా నిలిచాయి. ఈ సమావేశానికి బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ , బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్‌ , ఎన్సీనీ అధినేత శరద్‌ పవార్‌ , సీపీఎం నేత సీతారాం ఏచూరి , శివసేన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇండియన్‌ నేషనల్‌ లోకదళ్‌ అధినేత , దేవీలాల్‌ కుమారుడు ఓం ప్రకాశ్‌ చౌతాలా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

విపక్షాలు ఐక్యంగా పోరాడితే 2024లో బీజేపీ గద్దె దిగడం ఖాయమన్నారు నితీష్‌కుమార్‌. బీజేపీపై ఈ సమావేశంలో నిప్పులు చెరిగారు నితీష్‌. అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్ధుల ఓటమి వెనుక బీజేపీ కుట్ర ఉందన్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీతో తలపడేది థర్డ్‌ఫ్రంట్‌ కాదని , మేయిన్‌ ఫ్రంట్‌ అని స్పష్టం చేశారు నితీష్‌కుమార్‌.

దేశంలో రైతుల ఆత్మహత్యలు , నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు శరద్‌పవార్‌. అధికధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని , 2024లో బీజేపీని ఓడిస్తే రైతుల సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు పవార్‌. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రమే అని ఎన్‌డీఏ కూటమి కాదన్నారు తేజస్వియాదవ్‌. ఎన్‌డీఏ కూటమి నుంచి అన్ని పార్టీలు బయటకు వచ్చాయన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!