బ్రేకింగ్ : నిర్భయ దోషులకు డెత్ వారెంట్ ఇష్యూ.. ఉరి తీసేది ఆ రోజే..

ఢిల్లీలోని పటియాలా కోర్టు ఈ డెత్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ వారెంట్‌తో నలుగురు దోషులకు ఉన్న న్యాయమార్గాలన్నీ మూసుకుపోయాయి. దీంతో ఉరిశిక్ష నుంచి బయటపడాలని భావించిన నలుగురు దోషులకు కోర్టులో చుక్కెదురైంది.

బ్రేకింగ్ : నిర్భయ దోషులకు డెత్ వారెంట్ ఇష్యూ.. ఉరి తీసేది ఆ రోజే..
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2020 | 3:38 PM

నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఫైనల్ డెత్ వారెంట్ ఇష్యూ అయ్యింది. మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరితీయనున్నారు. ఢిల్లీలోని పటియాలా కోర్టు ఈ డెత్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ వారెంట్‌తో నలుగురు దోషులకు ఉన్న న్యాయమార్గాలన్నీ మూసుకుపోయాయి. దీంతో ఉరిశిక్ష నుంచి బయటపడాలని భావించిన నలుగురు దోషులకు కోర్టులో చుక్కెదురైంది. నలుగురు దోషుల క్షమాభిక్ష పిటిషన్లను కోర్టు రిజెక్ట్ చేసింది. గురువారం విచారణ జరిపిన ఢిల్లీలోని పటియాలా కోర్టు.. నలుగురు దోషులైన పవన్ గుప్తా, ముఖేష్, వినయ్ శర్మ, అక్షయ్‌లను ఉరి తీయాలని తీర్పునిచ్చింది.

నిర్భయ హత్యాచారంలో నలుగురు దోషులలో ఒకడైన పవన్‌ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి కోవింద్‌ బుధవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇతర దోషులైన ముకేశ్‌ కుమార్‌, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి ఇప్పటికే తిరస్కరించారు. దీంతో ఇక ఈ నలుగురు దోషులకు ఉరితీతకు దాదాపు అన్ని అడ్డంకులు తొలిగినట్లైంది.

కాగా, ఈ నలుగురు దోషుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది.