Omicron: కోరలు చాస్తోన్న ఒమిక్రాన్‌.. రేపటి నుంచి అక్కడ రాత్రి కర్ఫ్యూ..

ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భారత్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు 400కు సమీపిస్తున్నాయి. దీనికి తోడు క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సంబరాలతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం

Omicron: కోరలు చాస్తోన్న ఒమిక్రాన్‌.. రేపటి నుంచి అక్కడ  రాత్రి కర్ఫ్యూ..
Follow us

|

Updated on: Dec 24, 2021 | 9:23 PM

ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భారత్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు 400కు సమీపిస్తున్నాయి. దీనికి తోడు క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సంబరాలతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్న భావన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కొత్త వేరియంట్‌ విస్తరించకుండా ప్రభుత్వాలు ఆంక్షల దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తుండగా.. ఉత్తరప్రదేశ్‌లో రేపటి నుంచి నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఈ జాబితాలోకి మహారాష్ట్ర చేరింది. రేపటి (డిసెంబర్‌25) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  సినిమా థియేటర్లు, హోటల్స్, రెస్టారెంట్లు  50 శాతం ఆక్యుపెన్సీతో కార్యకలాపాలను కొనసాగించాలని ఆదేశించింది.  ఇక పెళ్లి వేడుకలు, ఫంక్షన్లకు కేవలం 250 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది.

కాగా మహారాష్ట్రలో తాజాగా 20 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల  సంఖ్య వంద దాటేసింది.  ఈ నేపథ్యంలో కొవిడ్ పరిస్థితిపై సమీక్షించేందుకు గురువారం కొవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే. కరోనా కొత్త వేరియంట్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.  కాగా మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ తర్వాత  నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న మూడో రాష్ట్రం మహారాష్ట్రే కావడం గమనార్హం . ఇక దేశ రాజధాని ఢిల్లీలో క్రిస్మస్‌, కొత్త సంవత్సరం వేడుకలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read:

Omicron Alert: భారత్‌లో ఒమిక్రాన్‌ ప్రకంపనలు.. అక్కడ రేపటి నుంచి నైట్‌ కర్ఫ్యూ..

Night Curfew: కోరలు చాస్తున్న ఒమ్రికాన్.. రాత్రిపూట కర్ఫ్యూ విధింపు.. మధ్యప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం!

Vadivelu Covid Positive: తమిళ నటుడు వడివేలుకు కరోనా పాజిటివ్‌.. చెన్నై ఆస్పత్రిలో చికిత్స..