PM Narendra Modi : లాక్ డౌన్ చివరి అస్త్రంగా మాత్రమే చూడండి రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచన

జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తున్నారు. కరోనా రెండో వేవ్ లో ఎదుర్కుంటున్న అనేక సమస్యలపై ఆయన మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం ఇపుడు కోవిడ్ రెండో వేవ్ ఎదుర్కొంటున్నాము. మీరు అనుభవిస్తున్న బాధను నేను అర్థం చేసుకున్నాను.

  • KVD Varma
  • Publish Date - 9:22 pm, Tue, 20 April 21
PM Narendra Modi : లాక్ డౌన్ చివరి అస్త్రంగా మాత్రమే చూడండి రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచన
Pm Modi

PM Narendra Modi: జాతినుద్దేశించి ప్రధాని మంగళవారం ప్రసంగించారు. కరోనా రెండో వేవ్ లో ఎదుర్కుంటున్న అనేక సమస్యలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం ఇపుడు కోవిడ్ రెండో వేవ్ ఎదుర్కొంటున్నాము. మీరు అనుభవిస్తున్న బాధను నేను అర్థం చేసుకున్నాను. లాక్ డౌన్ లను చివరి అస్త్రంగా మాత్రమే చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను..అని ప్రధాని మోడీ అన్నారు. దేశాన్ని లాక్‌డౌన్‌ నుంచి కాపాడాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడాలని ప్రధాని మోడీ చెప్పారు.  దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ధైర్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలమని చెప్పారు. అంతకు మందు అయన మాట్లాడుతూ దేశం నలుమూలలా ఆక్సిజన్‌ కొరత ఉందని  అన్నారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి సరఫరా కోసం అనేక చర్యలు తీసుకున్నామని, అనేక ప్లాంట్లు నెలకొల్పామని గుర్తు చేశారు. వైద్య అవసరాల కోసం ఔషధాల ఉత్పత్తి పెంచామని , ఫార్మా పరిశ్రమలు త్వరిత గతిన మెరుగైన వ్యాక్సిన్లు అందిస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టామని చెప్పిన ప్రధాని మోడీ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, వయోవృద్ధులకు టీకాలు వేశామన్నారు.

కరోనా కల్లోలంతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా అదుపులోకి రావడం లేదు. ఈ పరిస్థితుల్లో రెండు రోజులుగా ప్రధాని మోడీ వివిధ వర్గాలతో సమావేశం అయ్యారు. అనంతరం మంగళవారం ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను ప్రజలతో చర్చించారు. కరోనా మహమ్మారితొ అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయన్న ప్రధాని మోడీ.. త్వరలో సాధారణ పరిస్థితులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని సూచించారు. ధైర్యంగా ఉంటె కచ్చితంగా కరోనాపై విజయం సాధించగలమని ఆయన ప్రజలకు చెప్పారు.

Also Read: PM Narendra Modi: అపార్ట్‌మెంట్లలో కమిటీలుగా ఏర్పడితే కంటైన్‌మెంట్‌ జోన్లే అవసరం ఉండదు: ప్రధాని మోదీ

PMGKP Scheme: కోవిడ్‌ వారియర్స్‌కు పెద్ద ఊరట.. ఏప్రిల్ 24 నుంచి కొత్త బీమా విధానం : కేంద్ర ఆరోగ్య శాఖ