NBF: కేంద్ర సమాచార శాఖ మంత్రితో సమావేశమైన న్యూస్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఫెడరేషన్‌.. సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా అడుగులు

NBF: భారతదేశంలోని అతిపెద్ద ప్రసార నెట్‌వర్క్‌ న్యూస్‌ బ్రాడ్‌కాస్ట్ ఫెడరేషన్‌ (NBF). పాలక మండలి సభ్యులు, సీనియర్ సభ్యులు, ఇతర వార్త ప్రసారాల సంస్థలు కేంద్ర సమాచార శాఖ..

NBF: కేంద్ర సమాచార శాఖ మంత్రితో సమావేశమైన న్యూస్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఫెడరేషన్‌.. సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా అడుగులు
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 18, 2021 | 3:26 PM

NBF: భారతదేశంలోని అతిపెద్ద ప్రసార నెట్‌వర్క్‌ న్యూస్‌ బ్రాడ్‌కాస్ట్ ఫెడరేషన్‌ (NBF). పాలక మండలి సభ్యులు, సీనియర్ సభ్యులు, ఇతర వార్త ప్రసారాల సంస్థలు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో మంగళవారం సమావేశం అయ్యారు. న్యూస్‌ నెట్‌వర్క్‌ పరిశ్రమలో ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వార్తా ప్రసార రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఛానెళ్ల రేటింగ్‌లను వెంటనే పునరుద్దరించాలని కోరారు.  న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు అర్నాబ్ గోస్వామి నేతృత్వంలోని ఎన్‌బీఎఫ్‌ పాలక మండలి సభ్యులు మంత్రిని కలిసి తమ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా నెట్‌వర్క్‌ న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు అర్నాబ్‌ గోస్వామి మాట్లాడుతూ.. భారతదేశంలోని మీడియా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే చర్యల గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు.

వార్తా ప్రసార రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖతో చర్చించామన్నారు. అలాగే ఎన్‌బీఎఫ్‌ పాలక మండలి చేపట్టిన కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రికి వివరించారు. ఎన్‌బీఎఫ్‌ నిరంతర విస్తరణలో భాగంగా తాజాగా టీవీ9 నెట్‌వర్క్‌ చేర్చుకోవడంతోపాటు ఇటీవల సహారా నెట్‌ వర్క్‌, సీవీఆర్‌ నెట్‌వర్క్‌, వీ6ఛానెల్‌లను సభ్యులుగా చేర్చుకుంది.

వివిధ భాషలలో ప్రసారమయ్యే ఛానెల్‌ల బలోపేతం చేయడంపై మంత్రితో చర్చించినట్లు తెలిపారు. అనంతరం  ఎన్‌బీఎఫ్‌ వైస్‌ అధ్యకులు టీవీ9 నెట్‌వర్క్‌ సీఈవో బారున్ దాస్ మాట్లాడుతూ.. మంత్రితో సమావేశం కావడం ఎంతో ఆనందంగా ఉందని, మీడియాలో ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి తెలియజేశామన్నారు. న్యూస్‌ వ్యూయర్‌షిప్‌ రేటింగ్‌ ఉండటం ఎంతో అవసరమని అన్నారు. ఛానెళ్ల రేటింగ్‌ పునరుద్దరించే విషయమై మంత్రితో చర్చించినట్లు పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్‌ను కలిసిన వారిలో ఎన్బీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ బాల, ప్రైడ్ ఈస్ట్ ఎంటర్‌టైన్మెంట్స్ మేనేజింగ్ ఎడిటర్ రినికి భుయన్ శర్మ, ఐటీవీ నెట్‌వర్క్ ప్రమోటర్ కార్తికేయ శర్మ, ప్రాగ్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవి నారాయణ్, టీవీ9 భారత్‌వర్ష్ న్యూస్ డైరెక్టర్ హేమంత్ శర్మ, న్యూస్ నేషన్ ఎడిటర్ ఇన్ చీఫ్ మనోజ్ గైరోలా, ఎంహెచ్ఆన్‌లైన్ ఛైర్‌పర్సన్ మహేంద్ర భాట్లా, న్యూస్‌ఫస్ట్ కన్నడ బిజినెస్ హెడ్ ఎస్ దివాకర్, ఎన్‌బీఎఫ్ సెక్రటరీ జనరల్ ఆర్.జై కృష్ణ, ఎన్‌బీఎఫ్ అసోసియేట్ ఫర్ పాలసీ అండ్ రెగ్యులేషన్స్ ఈషితా తదితరులు పాల్గొన్నారు.

Also Read: NBF: న్యూస్‌నెట్‌వర్క్‌ టీవీ9ను స్వాగతించిన భారతదేశపు అతిపెద్ద న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌ ఫెడరేషన్‌

మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..

ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?

9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ

వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..

ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..