Marriage: పెళ్లైన 4 నెలలకే ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యువతి.. బిత్తరపోయిన భర్త, కుటుంబ సభ్యులు..

Marriage: ఓ నవ వధువు తన భర్తకే కాదు.. కుటుంబం మొత్తానికి షాక్ ఇచ్చింది. ఆమె చేసిన పనికి అత్తింటివారితో పాటు.. పుట్టినింటివారు

Marriage: పెళ్లైన 4 నెలలకే ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యువతి.. బిత్తరపోయిన భర్త, కుటుంబ సభ్యులు..
Representative image
Follow us

|

Updated on: Mar 05, 2022 | 8:09 AM

Marriage: ఓ నవ వధువు తన భర్తకే కాదు.. కుటుంబం మొత్తానికి షాక్ ఇచ్చింది. ఆమె చేసిన పనికి అత్తింటివారితో పాటు.. పుట్టినింటివారు సైతం కలవరపాటుకు గురయ్యారు. పెళ్లైన కొద్ది రోజులకే వధువు తన భర్తను వదిలేసి పారిపోయింది. పుణ్యక్షేత్రం దర్శనానికి వెళితే.. అదును చూసి అక్కడి నుంచి పారిపోయింది. ఎక్కడికి వెళ్లిందా అని వెతికే ఊహించని ప్లేస్‌లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పిలిభిత్‌లోని ఓ కుటుంబం నాలుగు నెలల క్రితం వారి కుమార్తెకు వివాహం చేశారు. పెళ్లయ్యాక అత్తమామలు తమ కోడలికి ఘనంగా స్వాగతం పలికారు. సొంత కూతురులా చూసుకున్నారు. తమను కూడా బాగా చూసుకుంటుందని భావించారు. కానీ, కొద్ది రోజుల్లోనే ఊహించని షాక్ ఇచ్చింది ఆ కోడలు. పెళ్లైన నాలుగు నెలల వరకు అంతా బాగానే ఉంది. ఈ క్రమంలోనే మార్చి 1వ తేదీన సదరు మహిళ తన కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రం సందర్శనకు వెళ్లింది. ఇదే అవకాశంగా భావించిన ఆమె.. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యింది. అయితే, కోడలు ఉన్నపళంగా కనిపించకుండా పోవడంతో అత్తమామలు, భర్త కంగారు పడ్డారు. ఎక్కడికి వెళ్లిందో అని వారి పుట్టింటికి ఫోన్ చేసి ఆరా తీశారు. అక్కడికి కూడా రాలేదని చెప్పడంతో.. మరింత కంగారు పడ్డారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ కోసం అటు పుట్టింటి వారు, ఇటు మెట్టినింటివారు తీవ్రంగా గాలించారు. చివరకు మహిళ సొంత మేనమామ ఇంట్లో చూడగా.. అక్కడ కనిపించి షాక్ ఇచ్చింది.

అక్కడి నుంచి ఆమెను ఇంటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా.. వచ్చేందుకు నిరాకరించింది. అతనే తన సర్వస్వం అని, అతనితోనే జీవితం పంచుకుంటానంటూ తేల్చి చెప్పింది. దాంతో ఈ వ్యవహారం పోలీసు స్టేషన్ గడప తొక్కింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Drugs: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

Russia Ukraine Crisis Live: తగ్గేదెలే అంటున్న రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మరం..

Medaram Hundi: మేడారం హుండీ లెక్కింపు పూర్తి.. ఈసారి తగ్గిన ఆదాయం.. ఇంకా తేలాల్సిన బంగారం, వెండి కానుకల లెక్కలు

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?