‘గలీజు పాలిటిక్స్’.. బీజేపీపై కేజ్రీవాల్ కుమార్తె ఫైర్

బీజేపీ నేతలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె 24 ఏళ్ళ హర్షిత మండిపడింది. తన తండ్రిని ఉగ్రవాదిగా ఆరోపిస్తున్నవారు ఇంతగా దిగజారి మాట్లాడతారని అనుకోలేదని వ్యాఖ్యానించింది. పాలిటిక్స్ లో మరీ ఇంత దిగజారుడుతనం  ఉంటుందా అని ప్రశ్నించింది. ‘రాజకీయాలు డర్టీ (చెత్త) అని చాలామంది అంటారు. కానీ ఇంత గలీజుగా ఉంటాయని నేను ఊహించలేదు’ అని ఆమె దుయ్యబట్టింది. ఉచితంగా వైద్య సౌకర్యాలు కల్పిస్తే అది టెర్రరిజం అవుతుందా? పిల్లలకు విద్యా సదుపాయాలు కల్పించినా, విద్యుత్, […]

'గలీజు పాలిటిక్స్'.. బీజేపీపై కేజ్రీవాల్ కుమార్తె ఫైర్

బీజేపీ నేతలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె 24 ఏళ్ళ హర్షిత మండిపడింది. తన తండ్రిని ఉగ్రవాదిగా ఆరోపిస్తున్నవారు ఇంతగా దిగజారి మాట్లాడతారని అనుకోలేదని వ్యాఖ్యానించింది. పాలిటిక్స్ లో మరీ ఇంత దిగజారుడుతనం  ఉంటుందా అని ప్రశ్నించింది. ‘రాజకీయాలు డర్టీ (చెత్త) అని చాలామంది అంటారు. కానీ ఇంత గలీజుగా ఉంటాయని నేను ఊహించలేదు’ అని ఆమె దుయ్యబట్టింది. ఉచితంగా వైద్య సౌకర్యాలు కల్పిస్తే అది టెర్రరిజం అవుతుందా? పిల్లలకు విద్యా సదుపాయాలు కల్పించినా, విద్యుత్, నీటి సౌకర్యాలు సమకూర్చినా అది ఉగ్రవాదం అవుతుందా అని హర్షిత సూటిగా ఎత్తిపొడిచింది. మా తండ్రిపై బీజేపీ నాయకులు ఎన్ని ఆరోపణలైనా చేయనివ్వండి ! వాళ్ళు 200 మంది ఎంపీలను, 11 మంది ముఖ్యమంత్రులను తెచ్చినా ఓకె ! కానీ.. ఢిల్లీలోని 2 కోట్లమంది ప్రజలు ఆప్ కు మద్దతునిస్తున్నారు అని ఆమె పేర్కొంది. కాగా-మొదట అరవింద్ కేజ్రీ వాల్ ను ఉగ్రవాదిగా బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఆరోపించారు. తన ఎన్నికల ప్రచారంలో ఆయన.. కేజ్రీవాల్ వంటి రహస్య ఉగ్రవాదులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోతున్నామని, కాశ్మీర్ లోని పాక్ ఉగ్రవాదులతో మనం పోరాడుతామా లేక కేజ్రీవాల్ వంటి టెర్రరిస్టులతోనా అని అన్నారు. తాను ఉగ్రవాది కానని కేజ్రీవాల్అమాయకంగా ముఖం పెట్టి అంటారని , కానీ అందుకు ఆధారాలు ఉన్నాయని పర్వేష్ వర్మ పేర్కొన్నారు. ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనచేస్తున్నవారు ఈ ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే ధర్నాకు దిగారని ఆయన ఆరోపించారు.

Published On - 10:28 am, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu