Driving Rules: డ్రైవింగ్‌ టెస్ట్ లేకుండానే లైసెన్స్ పొందవచ్చు.. జులై 1 నుంచి కొత్త నిబంధనలు..

Driving Rules: వచ్చే నెల నుండి డ్రైవింగ్‌కు సంబంధించిన నిబంధనలలో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ కొత్త నిబంధనల్లో డ్రైవింగ్..

Driving Rules: డ్రైవింగ్‌ టెస్ట్ లేకుండానే లైసెన్స్ పొందవచ్చు.. జులై 1 నుంచి కొత్త నిబంధనలు..
Driving
Follow us

|

Updated on: Jun 12, 2021 | 6:05 AM

Driving Rules: వచ్చే నెల నుండి డ్రైవింగ్‌కు సంబంధించిన నిబంధనలలో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ కొత్త నిబంధనల్లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం నిర్వహించే టెస్ట్‌కు మినహాయింపు ఇస్తున్నారు. వాస్తవానికి, గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల కోసం రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబంధనలు జూలై 1, 2021 నుండి అమల్లోకి వస్తాయి. ఈ నిబంధన మేరకు నమోదు చేసుకున్న డ్రైవింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకుంటారో వారికి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్ జారీ చేయడం జరుగుతుంది.

ప్రస్తుతం డ్రైవింగ్ టెస్ట్‌లను ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ)లో నిర్వహిస్తు్న్న విషయం తెలిసిందే. మీకు తెలియజేద్దాం. అటువంటి గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల నుండి శిక్షణ పూర్తి చేసిన తర్వాత డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది సహాయపడుతుంది.

ఈ నియమం వర్తిస్తుంది.. జూలై 1, 2021 నుండి, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల నుండి శిక్షణ తీసుకోవాలి. ఇలా గుర్తించబడిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల నుండి శిక్షణ పూర్తి చేసిన తర్వాత డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్ నేరుగా పొందవచ్చు.

డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల్లో ఉండాల్సినవి.. 1. శిక్షణా కేంద్రంలో సిమ్యులేటర్లు, ప్రత్యేక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అమర్చబడుతుంది. 2. మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం అవసరాలకు అనుగుణంగా ఈ కేంద్రాలలో రెమెడియల్, రిఫ్రెషర్ కోర్సులు పొందవచ్చు. 3. ఈ కేంద్రాల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు డ్రైవింగ్ పరీక్ష అవసరం నుండి మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం డ్రైవింగ్ పరీక్షను ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) నిర్వహిస్తుంది. 4. ఈ కేంద్రాలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిర్దిష్ట శిక్షణ ఇవ్వడానికి కూడా అనుమతించబడతాయి.

కాగా, నైపుణ్యం కలిగిన డ్రైవర్ల కొరత భారతీయ రహదారి రంగంలో ప్రధాన సమస్యలలో ఒకటి. రహదారి నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మోటారు వాహనాల (సవరణ) చట్టం 2019 లోని సెక్షన్ 8.. డ్రైవర్ శిక్షణా కేంద్రాల గుర్తింపుకు సంబంధించి నియమాలను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..