పతంజలి యూ టర్న్‌.. అది కరోనా మందు కాదు..

వారం రోజుల్లోనే పతంజలి మాట మార్చేసింది. గత మంగళవారం నాడు మధ్యాహ్నం కరోనా మహమ్మారికి మందు కనిపెట్టామని.. క్లినికల్ ట్రయల్స్ కూడా చేపట్టి.. సక్సెస్‌ అయ్యామంటూ ఊదరగొట్టిన..

పతంజలి యూ టర్న్‌.. అది కరోనా మందు కాదు..
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2020 | 6:57 PM

వారం రోజుల్లోనే పతంజలి మాట మార్చేసింది. గత మంగళవారం నాడు మధ్యాహ్నం కరోనా మహమ్మారికి మందు కనిపెట్టామని.. క్లినికల్ ట్రయల్స్ కూడా చేపట్టి.. సక్సెస్‌ అయ్యామంటూ ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 280 మంది కరోనా పేషెంట్లపై ప్రయోగించినట్లు కూడా తెలిపారు. అంతేకాదు.. కోరోనిల్‌ పేరుతో కరోనా కిట్‌ను కూడా లాంచ్‌ చేశారు. అయితే అది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కోరోనిల్‌కు బ్రేకులు వేసింది. ఈ మెడిసిన్‌పై ఎలాంటి ప్రచారాలు చేయవద్దని.. మార్కెటింగ్‌ కూడా చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అందుకు కారణం.. ఈ కోరోనిల్‌ మెడిసిన్‌ అనేది కరోనాకు విరుగుడు అని కేంద్ర ఆయుష్ డిపార్ట్‌మెంట్‌ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అంతేకాదు ఈ మెడిసిన్‌ శాస్త్రీయత నిర్ధారణ కావాల్సి ఉందని పేర్కొంది. ఈ క్రమంలో పతంజలి సంస్థకు ఆయుష్ డిపార్ట్‌ మెంట్‌ నోటీసులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు పతంజలి మాట మార్చింది. తాము కరోనాకు మందు కనుగొన లేదని ప్రకటించారు. అంతేకాదు.. కరోనా కిట్ కూడా తాము రెడీ చేయలేదని.. దీని పేరిట ఎలాంటి అమ్మకాలను కూడా చేపట్టలేదంటూ పతంజలి సంస్థ ఆయుష్ డిపార్ట్‌మెంట్‌కు వివరణ ఇచ్చింది.

దీంతో ప్రజలు ఇప్పుడు పతంజలి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇలా ప్రచారాలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే యోగా గురువు రాందేవ్ బాబా, పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణపై రాజస్థాన్‌లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే.. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. కరోనా నిరోధక మందుల తయారీకి సంబంధించి పతంజలి సంస్థ ఎలాంటి అనుమతులను తీసుకోలేదని.. జ్వరం, దగ్గు వంటి వాటిని తగ్గించేందుకు రోగనిరోధక శక్తి పెంచే మందు అనుకునే అనుమతులు ఇచ్చామని పేర్కొంది.