ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాన్ని మేం కోరలేదే ! ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం, ఉత్తర్వుల ఉపసంహరణకు ఆదేశం

నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్ లో కోవిడ్ సౌకర్యాలను  తాము కోరలేదని డిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి  తెలిపింది. హోటల్ అశోకాలో తమకు 100 గదులను కేటాయించాలన్న నిర్ణయాన్ని...

ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాన్ని మేం కోరలేదే ! ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు  ఆగ్రహం, ఉత్తర్వుల ఉపసంహరణకు ఆదేశం
Never Asked For 100 Rooms Facility At 5 Star Hotel
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 27, 2021 | 8:21 PM

నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్ లో కోవిడ్ సౌకర్యాలను  తాము కోరలేదని డిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి  తెలిపింది. హోటల్ అశోకాలో తమకు 100 గదులను కేటాయించాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటిని హైకోర్టు జడ్జీలు, జ్యూడిషియల్ అధికారులకు కేటాయించాలని సర్కార్ నిర్ణయించిందంటూ వార్తలు వచ్చాయి. కానీ  తాము ఎప్పుడు ఇలా కోరామని న్యాయమూర్తులు  ప్రశ్నించారు.ఓ జ్యూడిషియల్ అధికారి గానీ, జడ్జి గానీ కరోనా పాజిటివ్ కి గురైతే వారికి ఆసుపత్రి అడ్మిషన్ సౌకర్యం కల్పించాలని  మాత్రమే కోరామని వారన్నారు. దిగువస్థాయి జుడీషియరీ అధికారుల గురించే తమ యోచన అని,  ఇద్దరు జ్యూడిషియల్ ఆఫీసర్లు ఇప్పటికే మరణించారని వారు  పేర్కొన్నారు  ఇలాంటి వివాదాలు ఎందుకని, తామేమీ ప్రత్యేక సౌకర్యాలు కోరలేదని స్పష్టం  చేశారు. హాస్పిటల్స్ లో  బెడ్స్ కోసం రోగులు, ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ఈ స్థితిలో మేం ఇలా స్పెషల్ ఫెసిలిటీస్ కోసం కోరుతామని ఎలా అనుకున్నారు అని కూడా కోర్టు  ప్రశ్నించింది. కాగా ఈ వార్తలను మీడియాయే సృష్టించిందని ప్రభుత్వ లాయర్  పేర్కొన్నారు.సిటీ లోని పలు హోటళ్లు హాస్పిటల్స్ తోఒప్పందాలు  కుదుర్చుకుని  కోవిద్ కేంద్రాలుగా మారాయని ఆయన  చెప్పారు.అయితే దీనికి మండిపడిన కోర్టు మీడియాపై నెపం వేయరాదని, వారే కరెక్ట్   అని, మీ ఉత్తర్వులు తప్పు అని పేర్కొంది.

దీంతో   ప్రభుత్వం తన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. నగరంలోని ఫైవ్ స్టార్ అశోకా హోటల్ లో ఢిల్లీ హైకోర్టు  జడ్జీలకు,  జుడిషియల్ అధికారులకు ప్రత్యేకంగా వంద గదులను కేటాయించాలని  ప్రభుత్వం ఆదేశించినట్టు మంగళవారం వార్తలు వచ్చాయి.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..