National News: ఆ రంగంలో నేపాల్ స్వయం సంవృద్ధి.. భారత్ కు ఊరట కలిగించే అంశం..

బొగ్గు కొరతతో దేశంలో విద్యుత్ తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, దిల్లీ, పంజాబ్‌ తదితర..

National News: ఆ రంగంలో నేపాల్ స్వయం సంవృద్ధి.. భారత్ కు ఊరట కలిగించే  అంశం..
Follow us

|

Updated on: Nov 04, 2021 | 9:23 AM

బొగ్గు కొరతతో దేశంలో విద్యుత్ తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, దిల్లీ, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వాలు చెబుతున్నా రానున్న రోజుల్లో విద్యుత్ సంక్షోభం భారీగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియాలో ఇలా ఉంటే మన పక్క దేశమైన నేపాల్‌లో మాత్రం విద్యుత్‌ వెలుగులు విరజిమ్ముతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభమైన తమకోషి జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ ద్వారా సుమారు 456 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. దీని ఫలితంగానే నేపాల్‌ మిగులు విద్యుత్‌ దేశంగా మారిపోయింది.

39 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు.. ఈ క్రమంలో తమ మిగులు విద్యుత్‌ను విక్రయించడానికి నేపాల్‌ ముందుకు రావడం భారత్‌కు ఊరట కలిగించే విషయమని చెప్పవచ్చు. విద్యుత్ కొరతను అధిగమించడంలో భాగంగా నేపాల్‌ నుంచి మొత్తం 39 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం ప్రతిపాదనలు రడీ చేస్తోంది . మరోవైపు భారత్‌ కు మిగులు విద్యుత్‌ను విక్రయించేందుకు నేపాల్‌ ఇంధన, జలవనరులు, నీటిపారుదల శాఖ కూడా సుముఖత వ్యక్తం చేసింది. నేపాల్‌లోని త్రిశూలి హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నుంచి 24 మెగావాట్లు, దేవీ ఘాట్‌ జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి మరో 15 మెగావాట్లు…మొత్తం 39 మెగావాట్ల విద్యుత్‌ను భారత్‌ కు విక్రయించేందుకు నేపాల్‌ ఎలక్ర్టిసిటీ అథారిటీ నిర్ణయం తీసుకుందని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్‌ లిమిటెడ్‌, భారత్‌ విద్యుత్‌ మంత్రిత్వ శాఖల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే ఈ విద్యుత్ ఒప్పందం గురించి పూర్తి విషయాలు వెల్లడిస్తామన్నారు. సరిహద్దులకు సంబంధించి గత కొన్ని నెలలుగా భారత్- నేపాల్‌ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంతో ఇరు దేశాల మధ్య మళ్లీ సుహృద్భావ వాతావరణం నెలకొంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:

Ayyappa Deeksha: అయ్యప్ప దీక్ష అంటే ఏమిటి..? ప్రారంభమైన మాలాధరణలు.. దీక్ష నియమ నిబంధనలు..!

EV Charging: ఇండియన్‌ ఆయిల్‌ కీలక నిర్ణయం.. దేశంలో 2 వేల ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్‌లు..

‘Yoga Break’: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకపై కార్యాలయాల్లో మరో బ్రేక్.. ఎందుకోసమంటే..?

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!