ఎన్సీపీ, బీజేపీ రెండూ వేర్వేరు నదీ తీరాలు..కలిసే ప్రసక్తే లేదన్న నేత..మరి శరద్ పవార్ సాబ్ మాటో ..?

ఎన్సీపీ, బీజేపీ రెండూ వేర్వేరు నదీ తీరాలవంటివని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. తమ పార్టీ అధినేత శరద్ పవార్ ఢిల్లీలో ప్రధాని మోదీతో శనివారం సమావేశమైన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ..

ఎన్సీపీ, బీజేపీ రెండూ వేర్వేరు నదీ తీరాలు..కలిసే ప్రసక్తే లేదన్న నేత..మరి శరద్ పవార్ సాబ్ మాటో ..?
Ncp And Bjp Ideologically Different ,ncp Leader Nawab Malik,mumbai,ncp Leader Nawab Malik,sharad Pawar,bjp,pm Modi,bjp,ncp
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 17, 2021 | 5:33 PM

ఎన్సీపీ, బీజేపీ రెండూ వేర్వేరు నదీ తీరాలవంటివని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. తమ పార్టీ అధినేత శరద్ పవార్ ఢిల్లీలో ప్రధాని మోదీతో శనివారం సమావేశమైన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ..ఈ భేటీలో మాజీ రక్షణ శాఖ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఏ.కె. ఆంటోనీ, ఆర్మీ చీజ్ జనరల్ ఎం.ఎం. నరవాణే కూడా పాల్గొన్నారని తెలిపారు. భారత సరిహద్దుల్లోని పరిస్థితిని ఆంటోనీ వివరించారని, ఇలాంటి విషయాల్లో నాటి రక్షణ మంత్రిగా తన అనుభవాన్ని తెలియజేశారని ఆయన చెప్పారు.శరద్ పవార్ కు, మహారాష్ట్ర విపక్ష నేతలకు మధ్య సమావేశం జరిగినట్టు వచ్చిన వార్తలను కూడా నవాబ్ మాలిక్ ఖండించారు. ఇలాంటి సమావేశమేదీ జరగలేదన్నారు. బీజేపీ, ఎన్సీపీ మధ్య తేడాను ఆయన పేర్కొంటూ..ఇవి రెండూ వేర్వేరు నదీ తీరాలవంటివని, నీళ్లు ఉన్నంతవరకు కలిసే ప్రసక్తే లేదని చెప్పారు. ఇవి రెండూ పూర్తిగా రాజకీయంగా, సిధాంత పరంగా వేర్వేరు పంథాలు కలిగి ఉన్నాయన్నారు. వీటి మధ్య పొలిటికల్ అలయెన్స్ అన్న మాటే తలెత్తదన్నారు. అయితే పవార్ కు అన్ని పార్టీలతో మంచి సాన్నిహిత్యం ఉందని నవాబ్ మాలిక్ తెలిపారు.

కాగా పార్లమెంట్ సమావేశాలు జరగడానికి ఇక రెండు రోజులు మాత్రమే ఉండగా పవార్, ప్రధాని మోదీ ఇద్దరూ ఈ ఉదయం సుమారు 50 నిముషాలసేపు భేటీ అయ్యారు. ఇదే విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ధృవీకరించింది. అటు రాష్ట్రపతి పదవికి తాను రేసులో ఉన్నానని వచ్చిన వార్తలను పవార్ తోసిపుచ్చారు. ఇవి నిరాధారమైన వార్తలన్నారు. అయినా రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చునని అన్యాపదేశంగా ఆయన వ్యాఖ్యానించారు. పాలిటిక్స్ లో కురువృద్దుడైన పవార్ ప్రస్తుతం ఢిల్లీలో తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..గాంధీల కుటుంబంతో జరిపిన చర్చలు, ఆయన కాంగ్రెస్ లో చేరుతారని వచ్చిన వార్తలపై పవార్, మోదీ చర్చించినట్టు సమాచారం..

మరిన్ని ఇక్కడ చూడండి : రామయ్య నువ్వు రావాలయ్యా..!క్లిష్ట పరిస్థితుల్లో రామయ్యె రామబాణం అంటూ ఫ్యాన్స్ స్వాగతం.:Jr.NTR ReEntry Politics Live Video.

 భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..! జలమయంగా మారిన మహానగరం..:Heavy Rains Live Video.

 భూమీద నూకలున్నాయి అందుకే బ్రతికాడు..తృటిలో తప్పిన ప్రమాదం..అర్ధరాత్రి బైక్ పై వెళ్తున్న వ్యక్తి పై పడిన చెట్టు:Mahbhubnagar video.

 వరద నీటిలో ఈ బుడ్డోడి ఆటే వేరు.. వరద నీటిలో ఆడుతూ నెట్టింట వైరల్ అవుతున్న చిన్నారుల వీడియో :Children in Water Video.