Aryan Khan: షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు సమన్లు జారీ చేసిన ఎన్సీబీ సిట్‌

ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాకు ఎన్సీబీ సిట్‌ సమన్లు జారీ చేసింది.

Aryan Khan: షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు సమన్లు జారీ చేసిన ఎన్సీబీ సిట్‌
Aryan Khan
Follow us

|

Updated on: Nov 07, 2021 | 5:48 PM

ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు ఎన్సీబీ సిట్‌ సమన్లు జారీ చేసింది. ఆర్యన్‌తో పాటు మరో ఆరుగురికి సమన్లు జారీ చేయడంతో విచారణకు హాజరవుతున్నారు. సిట్‌ చీఫ్‌గా ఎన్పీబీ డిప్యూటీ డైరెక్టర్‌ సంజయ్‌సింగ్‌ వ్యవహరిస్తున్నారు. గత నెలలో ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన క్రూయిజ్ డ్రగ్ సీజ్ కేసుతో సహా ఆరు కేసులు శుక్రవారం ఎన్సీబీ ముంబై జోనల్ యూనిట్ నుంచి సిట్ బృందానికి బదిలీ చేయబడ్డాయి. సంజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని సిట్ బృందంలో 14 మంది విచారణ అధికారులు ఉంటారు. ఈ కేసుకు సంబంధించిన వివిధ ప్రాంతాలను సిట్ బృందం సందర్శించనుంది. ఎన్పీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేను ఈ కేసు విచారణ నుంచి తప్పించిన తరువాత సిట్‌ దర్యాప్తు చేపట్టింది.  సిట్ బృందం ముంబైలో ఉన్నందున, వచ్చే వారంలో కేసు దర్యాప్తు వేగవంతం అవుతుందని ఎన్సీబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్‌. ఆర్యన్‌ను కిడ్నాప్‌ చేసి ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు మాలిక్‌ . సెప్టెంబర్‌ లోనే దీనికి కుట్ర జరిగిందని, సమీర్‌ వాంఖడే సూత్రధారిగా వ్యవహరించారని ఆరోపించారు. సెప్టెంబర్‌ 27న ఆర్యన్‌ కిడ్నాప్‌కు ప్లాన్‌ జరిగిందని ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది.

మరోవైపు అక్టోబర్‌ 2న క్రూయిజ్‌పై దాడి పక్కా ప్లాన్‌ ప్రకారమే జరిగిందని ఆరోపిస్తున్నారు ప్రత్యక్ష సాక్షి విజయ్‌ పగారే. ఆర్యన్‌ఖాన్‌ అమాయకుడని..కావాలనే ఇరికించారని సిట్‌కు ఇచ్చిన వాంగ్యూలంలో పేర్కొన్నారు. డబ్బులు దోచుకునేందుకు కుట్ర చేశారని ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన వాంగ్మూలం సంచలనం సృష్టించింది.

Also Read: ‘జై భీమ్’ సినిమాలో సినతల్లి పాత్ర పోషించింది ఈమె అంటే నమ్ముతారా..? ఆసక్తికర విషయాలు

నెగిటివ్ రివ్యూస్‌తో నిండా ముంచేశారు.. పీఆర్వో వంశీ-శేఖర్‌పై యువ దర్శకుడి సంచలన ఆరోపణలు

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!