మందిర నిర్మాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అద్వానీ

మందిర నిర్మాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అద్వానీ

మరికొన్ని గంటల్లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం భూమి పూజ కార్యక్రమం జరగబోతోంది. ఈ మహత్తర కార్యానికి అయోధ్య నగరం ముస్తాబైంది. విద్యుత్ కాంతులతో నగర మంతా శోభాయమానంగా కన్పిస్తోంది. నగరం..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 05, 2020 | 6:15 AM

మరికొన్ని గంటల్లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం భూమి పూజ కార్యక్రమం జరగబోతోంది. ఈ మహత్తర కార్యానికి అయోధ్య నగరం ముస్తాబైంది. విద్యుత్ కాంతులతో నగర మంతా శోభాయమానంగా కన్పిస్తోంది. నగరం ఏటువైపు చూసినా కాషాయ జెండాలు, రాముడి చిత్ర పటాలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖులంతా అయోధ్య నగరానికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహత్తర కార్యానికి భూమిపూజ జరగనుంది. అయితే ఈ క్రమంలో రామ మందిర నిర్మాణానికి పోరాడిన వ్యక్తుల్లో ఒకరైన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ స్పందించారు. రామ మందిర భూమి పూజ విషయంతో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లకు తన కల సాకారమైందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయడం చారిత్రాత్మకమన్నారు.

ఇది తనతో పాటు.. భారతీయులందరికీ ఓ ఉద్వేగపూరిత క్షణమన్నారు. రామజన్మభూమిలో మందిర నిర్మాణం బీజేపీ కల అని.. రథయాత్ర ద్వారా ఉద్యమంలో పాల్గొని.. నా ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వహించానన్నారు. సుప్రీం తీర్పుకు లోబడి సామరస్య వాతావరణంలో.. మందిర నిర్మాణం జరగడం ఎంతో శుభపరిణామంటూ వ్యాఖ్యానించారు. మందిర నిర్మాణంతో.. రామ రాజ్యం వైపు అడుగులు పడుతున్నాయని.. సుపరిపాలన, సమ న్యాయం, సిరి సంపదలకు రామ రాజ్యం ఓ ఉదాహరణ అన్నారు.

కాగా, రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీతో పాటు మరికొందరు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుకానున్నారు.

Read More :

మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు

కొత్త మ్యాప్ అంటూ మన ప్రదేశాలతో.. పాక్‌ కన్నింగ్ వేషాలు

అయోధ్యకు చేరుకున్న ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌

శ్రీ శ్రీ రవి శంకర్‌కు అందని భూమి పూజ ఆహ్వానం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu