ఏం ఐడియా గురూ..! లోదస్తుల్లో బంగారం, పుస్తకాల్లో డాలర్లు.. నెక్ట్స్‌ లెవల్ స్మగ్లింగ్‌..!

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Jan 24, 2023 | 1:13 PM

అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు విదేశీ వ్యక్తులను కస్టమ్స్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్ని విచారించారు.  ఈ క్రమంలోనే..

ఏం ఐడియా గురూ..! లోదస్తుల్లో బంగారం, పుస్తకాల్లో డాలర్లు.. నెక్ట్స్‌ లెవల్ స్మగ్లింగ్‌..!
Mumbai Customs

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ శాఖ భారీ స్మగ్లింగ్‌ గుట్టు రట్టు చేసింది. స్మగ్లింగ్ కోసం తీసుకొచ్చిన రెండున్నర కిలోల బంగారం, 90వేల డాలర్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని లోదుస్తుల్లో పేస్ట్ రూపంలో దాచినట్టుగా అధికారులు గుర్తించారు. మరో కేసులో పుస్తకాల్లో డాలర్లు దాచిపెట్టుకుని వచ్చారు.  కానీ కస్టమ్స్ శాఖ అధికారుల దృష్టి నుంచి తప్పించుకోలేకపోయారు. ఈ కేసులో ఇద్దరూ విమానాశ్రయంలోనే పట్టుబడ్డారు. ఈ మేరకు ముంబై కస్టమ్స్ విభాగం సమాచారం ఇచ్చింది. అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు విదేశీ వ్యక్తులను కస్టమ్స్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్ని విచారించారు.  ఈ క్రమంలోనే ఇద్దరినీ తనిఖీ చేయగా డాలర్లు, బంగారం కనిపించాయి.

జ‌న‌వ‌రి 22, 23వ తేదీల్లో ఈ ఘ‌ట‌నలు జ‌రిగాయి. ఆ ప్రయాణికులు ఇద్ద‌రూ విదేశీయులే. పుస్త‌కాల్లో డాలర్ల నోట్ల‌ను ప‌ట్టుకువ‌స్తున్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఇంకా ఆ ప్ర‌యాణికుల నుంచి 2.5 కేజ‌ల బంగారాన్ని కూడా సీజ్ చేశారు. పేస్ట్ రూపంలో వాళ్లు ఆ బంగారాన్ని తీసుకువ‌చ్చారు. ఈ కేసులో ఇద్దరు విదేశీయులను ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.

నిందితుడు ఓ పుస్తకంలో దాచిపెట్టి 90 వేల డాలర్లు తీసుకొచ్చాడు. కస్టమ్స్ శాఖ తన వీడియోను విడుదల చేసింది. వారితో పాటు పుస్తకాల పేజీల్లో దాచిన 90 వేల డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అండర్‌గార్‌మెంట్‌లో పేస్ట్‌ రూపంలో దాచిన 2.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu