ONGC హెలికాప్టర్ ప్రమాదవశాత్తు అరేబియా సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు ఓఎన్జీసీ సిబ్బంది ఉన్నారు. ప్రమాదం సమయంలో హెలికాప్టర్లో ఇద్దరు పైలట్లు సహా మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. ముంబై అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అందులో 7 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని 5గురిని సురక్షితంగా రక్షించింది.
ముంబై తీరం నుంచి 50 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. సముద్ర తీరం నుంచి సముద్ర మధ్యలోని రిగ్‌పై ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్.. దానికి 1.5కిలోమీటర్ల దూరంలో ఫ్లోటర్ల ద్వారా అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు జరిగినట్లుగా సమాచారం. వెంటనే అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. నలుగురు మాత్రం చనిపోయారు. ఈ హెలికాప్టర్లో ఆరుగురు ఓఎన్జీసీ సిబ్బంది ఉండగా, ఒకరు కంపెనీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
సముద్రంలోని నిక్షేపాల నుంచి ఆయిల్, గ్యాస్‌ను వెలికి తీసేందుకు సంస్థలు రిగ్‌లను ఏర్పాటు చేస్తాయి. తీరం నుంచి సముద్రం మధ్యలోని రిగ్లపైకి సిబ్బంది సహా ఇతర సామగ్రి, పదార్థాలను చేరవేసేందుకు హెలికాప్టర్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు జరిగిన ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉందని ఓఎన్జీసీ అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
అదే సమయంలో.. హెలికాప్టర్ ఏ కారణాల వల్ల అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ అయ్యిందో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియలేదు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.