MoS Ajay Mishra: అజయ్‌ మిశ్రాకు ఢిల్లీ నుంచి పిలుపు.. రాజీనామా చేయిస్తారనే ఊహాగానాలు..

అంతా అనుకన్నట్లుగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. లఖిపూర్‌ ఖేరీ హింసాకాండలో కీలక నిందితుల్లో..

MoS Ajay Mishra: అజయ్‌ మిశ్రాకు ఢిల్లీ నుంచి పిలుపు.. రాజీనామా చేయిస్తారనే ఊహాగానాలు..
Mos Ajay Mishra
Follow us

|

Updated on: Dec 15, 2021 | 7:37 PM

అంతా అనుకన్నట్లుగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. లఖిపూర్‌ ఖేరీ హింసాకాండలో కీలక నిందితుల్లో కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రా కూడా ఉన్నాడు. ఈ క్రమంలో లక్నో నుంచి దేశ రాజధాని బయలుదేరారు. ఇదిలా ఉండగా.. లఖింపూర్‌ ఖేరి హింసాత్మక ఘటనపై చర్చకు పట్టుపట్టడంతో లోక్‌సభలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. దీంతో బుధవారానికి సభ వాయిదా పడింది. ప్రతిపక్షాలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశాయి.

మరో వైపు ఘటనపై విచారణ జరుపుతున్న యూపీ ప్రభుత్వ సిట్‌ మంగళవారం కోర్టుకు సమర్పించిన నివేదికలో ఘటన ‘ప్రణాళికాబద్ధమైన కుట్ర’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రమంత్రి వర్గం నుంచి మిశ్రాను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో రైతులపైకి కారు ఎక్కడంతో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ సహా మొత్తం ఎనిమిది మరణించిన విషయం తెలిసిందే.

అయితే ఇలా ఎంత మంది రైతుల మరణాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగాయోనని ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నేత జయా బచ్చన్ అన్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రికి ఢిల్లీ నుంచి పిలుపురావడంతో సర్వత్రా చర్చనీయాంశంమైంది. ఆయనతో రాజీనామా చేయిస్తారనే ఊహాగాలున్నాయి.

ఇవి కూడా చదవండి: Cow: ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన గోమాత.. రైతు ఇంట్లో పండుగ శోభ..

Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌కు మరింత ఊరట.. ఆ అవసరం లేదన్న బాంబే హైకోర్టు..