80 జిల్లాలపై ‘కరోనా పడగ’.. లాక్ డౌన్ అతిక్రమిస్తే చర్యలే !

దేశవ్యాప్తంగా కరోనాను నివారించడానికి 80 జిల్లాలను పూర్తిగా షట్ డౌన్ (లాక్ డౌన్) చేయాలని  కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, కేబినెట్ సెక్రటరీతో బాటు ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా హాజరైన

  • Umakanth Rao
  • Publish Date - 1:02 pm, Mon, 23 March 20
80 జిల్లాలపై 'కరోనా పడగ'.. లాక్ డౌన్ అతిక్రమిస్తే చర్యలే !

దేశవ్యాప్తంగా కరోనాను నివారించడానికి 80 జిల్లాలను పూర్తిగా షట్ డౌన్ (లాక్ డౌన్) చేయాలని  కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, కేబినెట్ సెక్రటరీతో బాటు ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా హాజరైన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోమ్ శాఖ వర్గాలు తెలిపాయి.  ఏపీలో ప్రకాశం, విజయవాడ, వైజాగ్ జిల్లాలు, తెలంగాణాలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ‘దిగ్బంధం’ లో ఉన్నాయి. లాక్ డౌన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆ యా రాష్ట్రాలను కోరింది. ఢిల్లీలో సోమవారం ఉదయం ఆరు గంటలనుంచి ఈ నెల 31 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.

కాగా-దేశంలో కరోనా కేసుల సంఖ్య 415 కి పెరిగింది. 329 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు కనుగొన్నారు. వీరిలో 23 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణాలో కరోనా కేసులు 30 కి పెరిగాయి. ఏపీలో ఏడుకు పెరగగా, మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, యూపీ రాష్ట్రాల్లో అత్యధికంగా నమోదయ్యాయి. మహారాష్ట్రలో 89, కేరళలో 67, కర్నాటకలో 27,తమిళనాడులో 9 కేసులు నమోదైనట్టు తెలిసింది.