Covid-19: దేశంలో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Covid-19: దేశంలో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Covid-19: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో సైతం బెడ్లు ఖాళీగా ఉండటం లేదు. ఇబ్బడిముబ్బడిగా..

Subhash Goud

|

Apr 15, 2021 | 6:14 AM

Covid-19: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో సైతం బెడ్లు ఖాళీగా ఉండటం లేదు. ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాలు, నగరాల్లో జనాలు కరోనాతో వణికిపోతున్నారు. కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశాలున్నాయని పుకార్లు వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ విధించబోదని ఆమె స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ కట్టడికి స్థానికంగానే నియంత్రణ చర్యలు ఉంటాయి తప్ప లాక్‌డౌన్‌ విధించే అవకాశమే లేదని స్పష్టం చేశారు. వరల్డ్‌ బ్యాంక్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌మాల్పస్‌తో వీడియో మీటింగ్‌లో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.

రెండోసారి కరోనా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోందని, అయినా కూడా మరోసారి పెద్ద ఎత్తున లాక్‌డౌన్‌ విధించే అవకాశమే లేదన్నారు. ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయడానికి తాము ఇష్టపడమని నిర్మలాసీతారామన్‌ పేర్కొన్నారు. కోవిడ్‌ రోగులను లేదా వారి కుటుంబాలకు భౌతిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం వంటివి పాటించడం వల్ల కరోనాను నియంత్రించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. కరోనా కేసులు పెరుగుతున్నాయి.. మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే పుకార్లను నమ్మవద్దని ఆమె అన్నారు. కరోనా కట్టడికి కేంద్ర మరిన్ని చర్యలు చేపడుతోందని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగవంతం చేసినట్లు చెప్పారు.

కాగా, కరోనా కొత్త కేసుల్లో బుధవారం నూతన గరిష్టం నమోదైంది. మంగళవారం నుంచి బుధవారం వరకు 24 గంటల్లో దేశంలో 1,84,372 మంది వైరస్‌ బారిన పడ్డారు. కరోనా మొదలైనప్పటి నుంచి చూస్తే ఒక్క రోజులో ఇన్ని కేసులు రావడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్‌ 17న నమోదైన 97,494 కేసులతో పోల్చితే దాదాపు రెట్టింపనే చెప్పాలి. ఇక కరోనా బారిన పడి మరణించే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఈ ఏడాదిలో ఎన్నడు లేనంతగా 1,027 మంది మరణించారు. గత ఏడాది అక్టోబర్‌ 18న 1033 మరణాలు సంభవించాయి.ఆ తర్వాత ఏనాడు కూడా వెయ్యి మరణాలు దాటలేదు.

కేసులతో నిండిపోతున్న ఆస్పత్రులు

దేశంలో సెకండ్‌ వేవ్‌లో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఆస్పత్రుల్ల ఐసీయూలో వెంటిలేటర్‌ పడకలు సైతం దొరకడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా కేసులతో నిండిపోతున్నాయి. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయనుకునే లోపే మళ్లీ తీవ్ర స్థాయిలో నమోదు అవుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. జనాలు వణికిపోన్నారు. కరోనా కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక వైపు వ్యాక్సినేషన్‌ జోరుగా కొనసాగుతున్నా.. మరో వైపు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.

సోంత గ్రామాలకు బయలుదేరిని వసల కార్మికులు

మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేవ్‌, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌ రాష్ట్రాలు కరోనాతో వణికిపోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో రోజురోజుకు తీవ్ర స్థాయిలో పాజిటివ్‌ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తు్న్నారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంకు రాకపోకలు నిలిపివేశారు. ఇక మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ కారణంగా ముంబాయి నుంచి వలస కార్మికులు పెద్ద ఎత్తున సొంత గ్రామాలకు బయలుదేరుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. ఏడాది ఉపాధి లేక ఇబ్బందులు పడ్డ వలస కార్మికులు.. కాస్త ఉపాధి లభించిందనుకునేలోపే మళ్లీ కరోనా తీవ్రమైన దెబ్బకొడుతోంది. మళ్లీ ఉపాధి లేకుండా చేస్తోంది.

ఇవీ కూడా చదవండి: Corona Pandemic: డాక్టర్ మానవత్వం..కరోనా పేషేంట్ కు పుట్టిన బిడ్డకు తన శ్వాసతో ప్రాణం పోసిన వైనం!

Trending: మాస్క్ గీస్క్ అక్కర్లే..ఈయన చెప్పినట్టు చేయండి చాలు..నెట్టింట్లో రచ్చ చేస్తున్న మహానుభావుడు!

Provident Fund: మీరు ఉద్యోగం వదిలిపెట్టిన తర్వాత ఈ పని చేయండి… లేకపోతే మీ పీఎఫ్‌ డబ్బులకు ఇబ్బందులు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu