యోగా గురు బాబా రామ్ దేవ్ ‘కొరొనిల్’ మందుపై రచ్చ, ఆరోగ్య శాఖ మంత్రిపై ఐఎం‌ఏ ఫైర్

కరోనా వైరస్ నివారణలో తమ కొరొనిల్ మందు అద్భుతంగా పని చేస్తుందంటూ యోగా గురు బాబా దేవ్ చెప్పుకోవడంపై  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ ఎంఎ) భగ్గుమంది..

యోగా గురు బాబా రామ్ దేవ్ 'కొరొనిల్' మందుపై రచ్చ, ఆరోగ్య శాఖ మంత్రిపై ఐఎం‌ఏ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 22, 2021 | 5:58 PM

కరోనా వైరస్ నివారణలో తమ కొరొనిల్ మందు అద్భుతంగా పని చేస్తుందంటూ యోగా గురు బాబా దేవ్ చెప్పుకోవడంపై  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ ఎంఎ) భగ్గుమంది. తమ పతంజలి సంస్థ తయారు చేసిన ఈ మందు ఉత్తమమైనదని, శాస్త్రీయంగా రూపొందించిందని రామ్ దేవ్ నాడు ప్రకటించారు. అయితే  ఇటీవల దీన్ని ప్రమోట్ చేసిన ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పై  కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విమర్శనాస్త్రాలతో విరుచుకుపడింది. తప్పుడు, అశాస్త్రీయమైన ఈ ప్రాడక్ట్ ని దేశం ముందు ఎలా ఉంచుతారని ప్రశ్నించింది. ఈ నెల 19 న ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, మరో మంత్రి నితిన్ గడ్కరీల సమక్షంలో రామ్ దేవ్ బాబా కొరొనిల్ మెడిసిన్ ని లాంచ్ చేశారు. (నిజానికి ఒకప్పుడు దీన్ని విడుదల చేసినా  తగినంత ప్రాచుర్యం లభించకపోవడంతో మళ్ళీ ఇందుకు పూనుకొన్నట్టు తెలుస్తోంది). ఫార్మాస్యూటికల్ ప్రాడక్ట్ గా కొరొనిల్ కు సర్టిఫికెట్ ఉందని, అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ విభాగం కూడా దీన్ని గుర్తించిందని ఆయన చెప్పారు. కానీ తాము ఈ మెడిసిన్ ని సమీక్షించలేదని, అలాగే కోవిడ్-19 ని నివారిస్తుందని చెప్పే ఏ సాంప్రదాయక మందుకూ మేం సర్టిఫికెట్ ఇవ్వలేదని  ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్వీట్ చేసింది.

ఈ నేపథ్యంలో తమ ఈ మెడిసిన్ కి ఈ సంస్థ గుర్తింపు ఉందని ఆరోగ్య శాఖ మంత్రి సమక్షంలో రామ్ దేవ్ బాబా ఎలా చెప్పుకుంటారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రశ్నించింది. ఇది దారుణమైన అబధ్ధమని నిప్పులు కక్కింది. డాక్టర్ కూడా అయిన హర్షవర్ధన్ దీన్ని ప్రమోట్ చేయడంపై ఈ దేశానికి సంజాయిషీ ఇవ్వాలని ఓ స్టేట్ మెంట్ లో డిమాండ్ చేసింది. దేశ  హెల్త్ మినిష్టర్ గా  మీరు మొత్తం దేశం ముందు తప్పుడు ప్రమోషన్ ఇవ్వడం సముచితమా ? అశాస్త్రీయమైన, తప్పుడు ప్రాడక్ట్ ని విడుదల చేయడంలో ఔచిత్యం ఉందా ?  మోడెర్న్ మెడిసిన్ డాక్టర్అని చెప్పుకుంటున్న మీరు ఈ విధమైన మందును దేశం ముందు ఎలా ఉంచుతున్నారు ? ప్రపంచ ఆరోగ్య శాఖ తిరస్కరించిన దీన్ని మీరు ప్రమోట్ చేయడం దేశ ప్రజలను అవమానించడం, వారిని మోసగించడమే అవుతుంది అని, ఈ మెడిసిన్ కి అంత సామర్థ్యమే ఉంటె ప్రభుత్వం వ్యాక్సినేషన్ కి 35 వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తోందని ఈ సంస్థ  ప్రశ్నల వర్షం కురిపించింది.

లోగడ గత ఏడాది ఈ మందుపై పెద్ద ఎత్తున వివాదం రేగినప్పుడు.. దీన్ని రోగ నిరోధక శక్తినిచ్ఛే ప్రాడక్టుగానే అమ్మాలి తప్ప కరోనా వైరస్ చికిత్సలో ఇది పని చేస్తుందని అమ్మరాదని ఆయుష్ మంత్రిత్వ శాఖ హెచ్ఛరించింది.

Read More:

కరోనా ఎఫెక్ట్‌: నిబంధనలు పాటించకుండా పెళ్లి వేడుక.. హాజరైన 350 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

Sandes App Launched : వాట్సాప్ ప్లేస్‌లో సందేశ్ యాప్‌ను లాంఛ్ చేసిన ప్రభుత్వం..ఎన్ని అదనపు పీచర్స్ ఉన్నాయో తెలుసా..!