Tamil Nadu: నూతన వధూవరులకు శుభవార్త.. ఫొటో షూట్ కోసం మెట్రో రైల్వే కీలక ప్రకటన

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ వేడుక ప్రత్యేక అనుభూతిని, అనుభవాన్ని మిగుల్చుతుంది. తమ పరిణయాన్ని జీవితాంతం గుర్తుంచకునేలా ఉండేందుకు వధూవరులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పెళ్లికి ముందు...

Tamil Nadu: నూతన వధూవరులకు శుభవార్త.. ఫొటో షూట్ కోసం మెట్రో రైల్వే కీలక ప్రకటన
Tamil Nadu Metro
Follow us

|

Updated on: May 23, 2022 | 9:15 PM

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ వేడుక ప్రత్యేక అనుభూతిని, అనుభవాన్ని మిగుల్చుతుంది. తమ పరిణయాన్ని జీవితాంతం గుర్తుంచకునేలా ఉండేందుకు వధూవరులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పెళ్లికి ముందు నిర్వహించే ఫొటో షూట్(Photo Shoot) కు ప్రాధాన్యత పెరిగింది. సెట్టింగులు, సినిమా పాటలను తలపించే రీతిలో షూట్ చేయించుకుంటున్నారు. అయితే.. తమిళనాడు(Tamil Nadu) లో ఫొటో షూట్ లపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని మెట్రో రైళ్లలో వధూవరుల ఫొటో షూట్‌ నిర్వహించేందుకు మెట్రోరైల్వే సంస్థ సన్నాహాలు చేపడుతోంది. ఇటీవల కేరళ(kerala) లోని కొచ్చిన్‌ నగరంలో నడుపుతున్న మెట్రో రైళ్లలో కొన్ని నిబంధనల మధ్య నవదంపతులు ఫొటో షూట్‌ను నిర్వహించేందుకు అనుమతించారు. నిలిచి వున్న ఓ మెట్రోరైలు బోగీలో రెండు గంటలపాటు వధూవరుల ఫొటో షూట్‌ జరుపుకొనేందుకు రూ.5వేలను ఛార్జీగా వసూలు చేశారు. అదే విధంగా కదులుతున్న రైలులోని ఓ బోగీలో ఫొటో షూట్‌ జరుపుకోవడానికి రూ.8వేలను ఛార్జీగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం కొచ్చిన్‌లో ఈ ఫొటో షూట్‌ అక్కడి మెట్రో రైల్వేకు ఆదాయం తెచ్చి పెడుతోంది.

ఈ పరిస్థితుల్లో తమిళనాడులోనూ మెట్రో రైళ్లలో వెడ్డింగ్‌ ఫొటో షూట్‌లు నిర్వహించాలని మెట్రో రైల్వే సంస్థ అధికారులు భావిస్తున్నారు. సెలవు దినాల్లో, రాత్రి వేళల్లో సినిమా షూటింగ్‌లు, యాడ్‌ ఫిల్ముల షూటింగ్‌లు జరుపుకొనేందుకు అనుమతిస్తున్నామని మెట్రో రైల్ సంస్థ అధికారులు తెలిపారు. ఈ రైళ్లలో రోజూ 1.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఈ పరిస్థితులలో అనువైన సమయాలలో కేరళ తరహాలో వధూవరుల ఫొటో షూట్‌ నిర్వహించేందుకు అనుమతించే అవకాశం ఉందని వెల్లడించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

RBI Governor: వడ్డీ రేట్ల పెంపుపై సంచలన కామెంట్స్ చేసిన రిజర్వు బ్యాంక్ గవర్నర్.. వచ్చే సమావేశంలో..

Shekar: ‘శేఖర్’ మూవీ వివాదంలో జీవితా రాజశేఖర్ గెలుపు.. న్యాయస్థానం ఏమన్నదంటే