MEIL: మరో అద్భుతమైన ప్రాజెక్ట్‌ పూర్తి చేసిన మేఘా సంస్థ.. బీహార్‌లో హర్ ఘర్ గంగాజల్‌ తొలి ద‌శ ప‌నుల‌ు పూర్తి..

భారీ ప్రాజెక్ట్‌లు చేపట్టడంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న మేఘా సంస్థ.. మరో అద్భుత ప్రాజెక్ట్‌ పూర్తి చేసింది. బీహార్‌లోని లక్షలాది మంది స్థానిక ప్రజలు, యాత్రికులు, పర్యాటకుల్లో సంతోషం పొంగించే 'హర్ ఘర్ గంగాజల్‌' మొద‌టి ద‌శ ప‌నులు విజయవంతంగా పూర్తయ్యాయి.

MEIL: మరో అద్భుతమైన ప్రాజెక్ట్‌ పూర్తి చేసిన మేఘా సంస్థ.. బీహార్‌లో హర్ ఘర్ గంగాజల్‌ తొలి ద‌శ ప‌నుల‌ు పూర్తి..
Gangajal Aapurti Yojana
Follow us

|

Updated on: Nov 22, 2022 | 8:43 PM

భారీ ప్రాజెక్ట్‌లు చేపట్టడంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న మేఘా సంస్థ.. మరో అద్భుత ప్రాజెక్ట్‌ పూర్తి చేసింది. బీహార్‌లోని లక్షలాది మంది స్థానిక ప్రజలు, యాత్రికులు, పర్యాటకుల్లో సంతోషం పొంగించే సీఎం నితీశ్ కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘హర్ ఘర్ గంగాజల్‌’ మొద‌టి ద‌శ ప‌నుల‌ు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌తో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన బోధ్ గయా, గయ, రాజ్‌గిర్ తాగునీటి క‌ష్టాలు తీరిపోనున్నాయి. శుద్ధి చేసిన గంగాజలాలు ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటాయి. భౌగోళిక ప‌రిస్థితుల కార‌ణంగా గంగా జలాలు అందుబాటులో లేని ఈ ప్రాంతాలకు ఆ న‌దిలోని వరదనీటిని తాగునీరుగా మార్చే ప్రాజెక్టే హర్ ఘర్ గంగాజల్. దీని ద్వారా 7.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.

ప్రాజెక్ట్ మొదటి దశలో భాగంగా హతిదాలో ఇన్ టేక్ వెల్, పంప్ హౌస్ నిర్మించారు. రాజ్‌గిర్ దగ్గర నిర్మించిన డిటెన్షన్ ట్యాంక్‌కు పైప్‌లైన్ ద్వారా నీరు పంపుతారు. దీని కోసం హతిదా, రాజ్‌గిర్, తేటర్, గయాలో నాలుగు పంప్ హౌస్‌లు, మూడు భారీ రిజర్వాయర్‌లను నిర్మించారు.

రిజర్వాయర్లలోకి వ‌ర‌ద నీటిని నింపి, అక్కడి నుంచి రాజ్‌గిర్‌, మ‌న్పూర్, గ‌యా దగ్గర ఏర్పాటు చేసిన‌ మూడు నీటి శుద్ధి ప్లాంట్‌లోకి పంప్ చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా రెండు విద్యుత్ సబ్‌స్టేషన్‌లను, 151 కిలోమీట‌ర్ల పొడవైన్ పైప్‌లైన్‌ ఏర్పాటు చేసింది.

నాలుగు వంతెనలతోపాటు రైలు ఓవర్ బ్రిడ్జిని కూడా మొద‌టి ద‌శ ప‌నుల్లో భాగంగా నిర్మించింది మేఘా. క‌రోనాతో పాటు, ఇతర సవాళ్లను అధిగమించి MEIL ఈ ప్రాజెక్ట్ ను రికార్డు సమయంలో పూర్తి చేసింది. నవంబర్ 27న రాజ్‌గిర్‌లో, నవంబర్ 28న గయా – బోధ్ గయలో సీఎం నితీష్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.