Meena Harris: ఒక్క ట్వీట్‌తో యావత్ ప్రపంచమే కదిలింది.. మరి ఆమె ప్రాణాలతో బయటపడేనా!?..

Meena Harris: ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుందనేది నానుడి. ఈ నానుడి జీవిత లక్ష్యం..

Meena Harris: ఒక్క ట్వీట్‌తో యావత్ ప్రపంచమే కదిలింది.. మరి ఆమె ప్రాణాలతో బయటపడేనా!?..
Shiva Prajapati

|

Feb 10, 2021 | 11:05 PM

Meena Harris: ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుందనేది నానుడి. ఈ నానుడి జీవిత లక్ష్యం చేధించడం కోసమైనా.. స్వేచ్ఛా వాయువులు పీల్చడం కోసమైనా.. ఉద్యమ పోరాటానికైనా.. వర్తిస్తుందనడంతో ఏమాత్రం సందేహం లేదు. అయితే ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇటీవల ఓ కేసులో అరెస్టయిన 23 ఏళ్ల దళిత యువతి నవ్‌దీప్ కౌర్ విషయంలో సరిగ్గా ఈ సూక్తి వర్తిస్తుందనే చెప్పాలి. రైతు ఉద్యమానికి సంఘీభావం తెలుపడం, తోటి మహిళా కార్మికులపై జరుగుతున్న అకృత్యాలను నిలదీయడమే తప్పుగా నవ్‌దీప్ కౌర్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆమెకు తొలుత అండగా నిలిచింది ఇద్దరంటే ఇద్దరే. వారిలో ఒకరు ఆమె తల్లి కాగా.. మరొకరు ఆమె చెల్లి. కానీ ఒకే ఒక్కరు చేసిన ట్వీట్‌తో భారతదేశం మాత్రమే కాదు. యావత్ ప్రపంచం నవ్‌దీప్‌ కౌర్‌కు అండగా నిలుస్తోంది. ఆమెను తక్షణమే విడుదల చేయాలంటూ నినదిస్తోంది. ఇంతకీ ఈ నవ్‌దీప్ కౌర్ ఎవరు? ఆమెను పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేశారు? ఆమెకు అండగా ట్వీట్ ఎవరు చేశారు? అంత ఫాలోయింగ్ ఎలా వచ్చింది? అనే అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పంజాబ్‌కు చెందిన దళిత యువతి నవ్‌దీప్‌ కౌర్(23) కరోనా సంక్షోభం కారణంగా పీకల్లోతు కష్టాల్లో కూరకుపోయిన కుటుంబానికి బాసటగా నిలిచేందుకు ఢిల్లీ వచ్చి ఓ ఫ్యాక్టరీలో పనికి చేరింది. అయితే, ఆమె పనిచేసే ప్రాంతంలోనే రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టారు. రైతుల ఉద్యమానికి చలించిపోయిన నవ్‌దీప్ కౌర్.. వారి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించింది. అంతేకాదు.. తాను పని చేస్తున్న ఫ్యాక్టరీలో పలువురిని ఉద్యోగం నుంచి తొలగించడంపైనా ఆమె గళమెత్తింది. ఈ క్రమంలో నవ్‌దీప్ కౌర్ ‘మజ్దూర్ అధికార్ సంఘటన్’లో చేరింది. ఫ్యాక్టరీలో మహిళా కార్మికులపై జరుగుతున్న అఘాయిత్యాలపై నినందించింది. ఫ్యాక్టరీ యాజమాన్యం ఆగడాలను బట్టబయలు చేసింది.

నవ్‌దీప్‌ కౌర్‌ చర్యలను తీవ్రంగా పరిగణించిన పరిశ్రమ యాజమాన్యం.. ఆమెపై కుట్రలు చేసి కేసులు పెట్టింది. పరిశ్రమ యాజమాన్యం పెట్టిన కేసుల ఆధారంగా పోలీసులు జనవరి 12వ తేదీన నవ్‌దీప్‌ కౌర్‌ను అరెస్ట్ చేశారు. అయితే బెయిల్‌ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇదిలాఉంటే.. నవ్‌దీప్‌ కౌర్‌ను జైలులో చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆమె అరెస్టైన రెండు రోజులకే నడవలేని స్థితిలోకి చేరిందంటే.. ఆమె పట్ల పోలీసులు ఏ విధంగా ప్రవర్తించానేది స్పష్టమవుతోంది. అంతేకాదు.. ఇక్కడ మరో సంచలన విషయం వెలుగు చూసింది. నవ్‌దీప్ కౌర్‌కి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమె జననావయవాలపై పోలీసులు లాఠీతో దెబ్బలు కొట్టారని నిర్ధారణ అయ్యింది. ఆ కారణంగానే ఆమెకు రక్తస్త్రావం అయినట్లు వైద్య నిపుణులు తేల్చారు. నవ్‌దీప్‌ను అరెస్ట్ చేసి నేటికి సరిగ్గా 28 రోజులు అవుతోంది. ఈ కొద్దిరోజుల వ్యవధిలోనే ఆమెను ఇన్ని చిత్రవధలకు గురిచేసిన పోలీసులు.. ఆమెను బ్రతకినిస్తారా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలోనే అమెకు అండగా యావత్ ప్రపంచమే కదులుతోంది.

నవ్‌దీప్ కౌర్ దారుణస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడుతున్నప్పటికీ.. పోరాటమే ఊపిరిగా భావిస్తున్నారు. ‘జైల్లో మా అక్కడను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆమె కాళ్ల మధ్య నుంచి రక్తం స్రావం కావడాన్ని గమనించిన సహ ఖైదీలు మాకు సమాచారం అందించారు. ఈ విషయంపై మేము బాధపడ్డప్పటికీ భయపడలేదు. అయితే పోరాడితే గానీ బ్రతకలేమంటూ అక్కకి అమ్మ ధైర్యం చెబుతూ వర్తం పంపించింది. మా అక్క కూడా చాలా ధైర్యవంతురాలు. తన తుదిశ్వాస వరకూ పోరాడుతూనే ఉంటుంది’ అని నవ్‌దీప్ కౌర్ చెల్లెలు రాజ్‌వీర్ కౌర్ మీడియాకు చెప్పింది.

ఇదిలాఉంటే, నవ్‌దీప్ కౌర్ అరెస్ట్ అంశం.. అమెరికా అధ్యక్షుడు కమలా హ్యారీస్‌ చెల్లెలి కూతురు మీనా హ్యారీస్‌ను చలింపజేసింది. నవ్‌దీప్ కౌర్‌కు మద్ధతుగా మీనా హ్యారీస్ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు నవ్‌దీప్‌ కౌర్‌కు కేవలం తల్లి, చెల్లి మాత్రమే అండగా ఉండగా.. మీనా హ్యారీస్ చేసిన ట్వీట్‌తో భారతదేశంలోనే కాకుండా, యావత్ ప్రపంచం నవ్‌దీప్‌ కౌర్‌కు అండగా నిలుస్తోంది.

మీనా హ్యారీస్ ఫోటోను కొందరు వ్యక్తులు తగులబెడుతున్న ఫోటోను ఓవైపు, నవ్‌దీప్‌ కౌర్‌ను విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్న నిరసనకారుల ఫోటోను మరోవైపు జత చేసి ట్వీట్ చేశారు. ‘‘ఒక అతివాద ముఠా మన ఫొటోను మంటల్లో తగలబెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం ఇండియాలో ఉండిఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఊహించుకోండి. కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న 23 ఏళ్ల యువతి నవ్‌దీప్‌కౌర్‌ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను దారుణంగా హింసించారు. లైంగిక వేధింపులకు కూడా గురిచేశారు. ఆమెను 20 రోజులకు పైగా జైలులో ఉంచి బెయిల్ రాకుండా చేస్తున్నారు’’ అంటూ మీనా హ్యారీస్ ట్వీట్ చేశారు. ఈ ఒక్క ట్వీట్‌తో యావత్ ప్రపంచమే కదిలింది. దేశ విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ‌లు స్పందిస్తున్నారు. నవ్‌దీప్ కౌర్‌ను విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Meena Harris Tweet:

Also read:

బిగ్ బ్రేకింగ్ : ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో దారుణం, ఇంజనీరింగ్ స్టూడెంట్‌పై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం

Swami Vivekananda: భాగ్యనగరానికి నేడు ప్రత్యేకమైన రోజు.. 128 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu