సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను తొలగించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్.. ప్రధాని మోదీకి లేఖ

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను తొలగించాలని కోరుతూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోదీకి లేఖ రాశారు.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను తొలగించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్.. ప్రధాని మోదీకి లేఖ
Tushar Mehta
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 03, 2021 | 10:36 AM

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను తొలగించాలని కోరుతూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీజేపీ నేత సువెందు అధికారిని ఆయన ఎందుకు కలుసుకోవలసి వచ్చిందని వారు తమ లేఖలో ప్రశ్నించారు. కొన్ని కేసుల్లో సీబీఐ తరఫున సుప్రీంకోర్టులో వాదిస్తున్న తుషార్ మెహతా.. తాను…అధికారిని కలుసుకోలేదని స్పష్టం చేశారు. కాగా- సువెందు అధికారిపై గల పలు క్రిమినల్ కేసులను సీబీఐ విచారిస్తోందని, అలాంటి నిందితునితో సొలిసిటర్ జనరల్ మీట్ అయినట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని టీఎంసి ఎంపీలు అన్నారు. అటు-ఈ వార్తలను మెహతా ఖండిస్తూ.. తనకు ముందే తెలియజేయకుండా సువెందు అధికారి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తమ ఇంటికి వచ్చారని.. కానీ తను మరో మీటింగ్ లో ఉన్న కారణంగా ఆయనను వెయిట్ చేయమని చెప్పానని, అరగంట తరువాత మీతో సమావేశం కాలేనని ఆయనకు చెప్పడంతో ఆయన వెళ్లిపోయారని అన్నారు. . అలాంటప్పుడు నేను ఆయనతో మీట్ కావడమేమిటన్నారు.

అధికారి కూడా నేను మెహతా ఇంటికి వెళ్లిన మాట నిజమేనని,, బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై మాట్లాడేందుకు వెళ్లినా ఆయనను కలుసుకోలేదని వెల్లడించారు. అయితే మమత మేనల్లుడు అభిషేక్ ముఖర్జీ.. అధికారి…. మెహతాను కలుసుకునే ఉంటారని ట్వీట్ చేశారు. అరగంట సేపు ఉన్నారంటే మీట్ కాకుండా ఉంటారా అన్నారు. నారదా స్టింగ్ ఆపరేషన్ స్కామ్ లో సువెందు అధికారిని సీబీఐ ఓ నిందితునిగా పేర్కొంది. ఈ స్కామ్ లో ఇద్దరు మంత్రులపైన, తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన ఇద్దరు నేతలపైనా సీబీఐ దర్యాప్తు జరుపుతోంద

మరిన్ని ఇక్కడ చూడండి: Hyderabad: వయసేమో చిన్నది.. చేసే పనులు మాత్రం చాలా పెద్దవి.. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు..!

Microsoft Bug: బగ్‌ను కనిపెట్టి రూ 22 లక్షలు గెలుచుకున్న ఢిల్లీ యువతి… ( వీడియో )