Mayawati: విపక్ష కూటమిలో చేరేందుకు BSP సై.. అయితే ఆ ఒక్క కండీషన్ అంగీకరిస్తేనేనట..

ఎన్డీయే కూటమిని ధీటుగా ఎదుర్కొనేందుకు బలమైన విపక్ష కూటమి ఏర్పాటు దిశగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన చర్చల్లో భాగంగానే గత ఆదివారంనాడు బీహార్ సీఎం, జేడీయు అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ హస్తినలో సోనియా గాంధీతో భేటీ అయ్యారు.

Mayawati: విపక్ష కూటమిలో చేరేందుకు BSP సై.. అయితే ఆ ఒక్క కండీషన్ అంగీకరిస్తేనేనట..
BSP Chief MayawatiImage Credit source: TV9 Telugu
Follow us

|

Updated on: Sep 28, 2022 | 11:50 AM

2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కూటమి రాజకీయాలు జోరందుకున్నాయి. ఎన్డీయే కూటమిని ధీటుగా ఎదుర్కొనేందుకు బలమైన విపక్ష కూటమి ఏర్పాటు దిశగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన చర్చల్లో భాగంగానే గత ఆదివారంనాడు బీహార్ సీఎం, జేడీయు అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ హస్తినలో సోనియా గాంధీతో భేటీ అయ్యారు. మరిన్ని భావసారూప్య పార్టీలను విపక్ష కూటమిలోకి తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరుపుతామని భేటీ అనంతరం నితీశ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో విపక్ష కూటమిలో ఏయే పార్టీలు చేరే అవకాశముందన్న అంశంపై హస్తిన వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అటు ఈ విపక్ష కూటమిలో చేరేందుకు సిద్ధమంటూ బహుజన్ సమాజ్‌వాది పార్టీ (బీఎస్పీ) కీలక ప్రకటన చేసింది. అయితే దీని కోసం ఓ కండీషన్ పెట్టింది. పార్టీ అధినేత్రి మాయావతిని ప్రధాని అభ్యర్థిగా విపక్ష కూటమిలోని భాగస్వామ్యపక్షాలు అంగీకరిస్తే మాత్రమే ఆ కూటమిలో చేరేందుకు సిద్ధమని బీఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి ధరంవీర్ చౌదరీ స్పష్టంచేశారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం బెహెన్‌జీ (మాయావతి) తీసుకుంటారని అన్నారు.

ఈ విషయంలో విపక్ష నేతలు గౌరవ ప్రదమైన రీతిలో తమ పార్టీ అధినేత్రిని (మాయావతి) సంప్రదించి.. వారి అజెండాను వివరిస్తే.. వారితో కలిసి పనిచేసే అంశాన్ని పార్టీ(బీఎస్పీ) సానుకూలంగా పరిశీలిస్తుందని ధరంవీర్ చౌదరీ పేర్కొన్నారు. మాయావతి స్థాయి కలిగిన నాయకులు ఎవరూ విపక్షాల్లో లేరని.. మాయావతి పాన్ ఇండియా స్థాయి కలిగిన గొప్ప నాయకురాలిగా పేర్కొన్నారు.

అఖిలేష్ యాదవ్ (ఎస్పీ)తో పొత్తు అవకాశాలపై స్పందించిన చౌదరి.. అఖిలేష్ యాదవ్ కంటే మాయావతి పెద్ద నాయకురాలన్నారు. అఖిలేష్ యాదవ్ ఒక్కసారి యూపీకి సీఎం అయ్యారని గుర్తుచేసిన ఆయన.. మాయావతి నాలుగుసార్లు ఆ రాష్ట్ర సీఎంగా పనిచేశారని అన్నారు. అదే సమయంలో ఇతరులు చేసిన తప్పిదాలను మన్నించే గొప్ప హృదయం మాయవతికి ఉందన్నారు. క్లీన్ హార్ట్‌తో తమ నాయకురాలిగా మాయావతిని అఖిలేష్ అంగీకరిస్తే.. పుష్పగుచ్ఛాలిచ్చి ఆయనకు స్వాగతం పలికేందుకు తాము సిద్ధమన్నారు.

ఇవి కూడా చదవండి

అప్పట్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఎన్సీపీ ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశానికి బీఎస్పీకి ఆహ్వానం అందలేదు. విపక్షాల తీరుపై మాయావతి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..