మంగళ్‌యాన్ మిషన్.. అంగారక గ్రహంలో ఏమిటా వింత ?

అంతరిక్ష రంగంలో ఇస్రో సాంకేతికంగా  మరో విజయాన్ని సాధించింది. ఇస్రోకు చెందిన ‘మంగళ్ యాన్”.. (మార్స్ ఆర్బిటర్ మిషన్) అంగారక గ్రహానికి  సంబంధించిన అద్భుతమైన అతి పెద్ద ఇమేజ్ ని క్యాప్చర్  చేయగలిగింది. దీన్ని అంతు తెలియని (మిస్టీరియస్) ‘ఫోబోస్’ ఇమేజీగా పేర్కొంటూ ట్వీట్ చేసింది. మార్స్ కలర్ కెమెరా ఈ గ్రహానికి సంబంధించి.. దాదాపు గుండ్రని శిల వంటి ఛాయాచిత్రాన్ని ఈ నెల 1 న తీసినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ గ్రహానికి సుమారు 7,200 […]

మంగళ్‌యాన్ మిషన్.. అంగారక గ్రహంలో ఏమిటా వింత ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 04, 2020 | 5:24 PM

అంతరిక్ష రంగంలో ఇస్రో సాంకేతికంగా  మరో విజయాన్ని సాధించింది. ఇస్రోకు చెందిన ‘మంగళ్ యాన్”.. (మార్స్ ఆర్బిటర్ మిషన్) అంగారక గ్రహానికి  సంబంధించిన అద్భుతమైన అతి పెద్ద ఇమేజ్ ని క్యాప్చర్  చేయగలిగింది. దీన్ని అంతు తెలియని (మిస్టీరియస్) ‘ఫోబోస్’ ఇమేజీగా పేర్కొంటూ ట్వీట్ చేసింది. మార్స్ కలర్ కెమెరా ఈ గ్రహానికి సంబంధించి.. దాదాపు గుండ్రని శిల వంటి ఛాయాచిత్రాన్ని ఈ నెల 1 న తీసినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ గ్రహానికి సుమారు 7,200 కి.మీ. దూరం నుంచి ఈ ఫోటోని తీయగలిగందట. మార్స్ ఆర్బిటర్ మిషన్ లోని 6 ఎంసీసీ ఫ్రేములు స్పష్టంగా ఈ ఇమేజీని తీసినట్టు ఈ సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఫోబోస్ అన్నది అంగారక గ్రాహం ఏర్పడిన అతి పెద్ద క్రేటర్.. కార్బొనేషియస్ పదార్థాలతో ఇది ఏర్పడిందని భావిస్తున్నారు. గ్రీక్ దేవుడు ‘ ఫోబోస్’ పేరిట ఈ క్రేటర్ ని అభివర్ణిస్తున్నారు. అంగారక ఉపరితలానికి ఈ ఉపగ్రహం సుమారు ఏడు వేల కి.మీ. దూరంలో ఉందని భావిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. మార్స్ పరిభ్రమణం కన్నా ఈ శాటిలైట్ అతి వేగంగా పరిభ్రమిస్తోందని ఇస్రో వెల్లడించింది. 2013 నవంబరు 5 న మార్స్ ఆర్బిటర్ మిషన్ ని లాంచ్ చేశారు. మంగళ్ యాన్ పేరిట వ్యవహరించే ఇది 2014 సెప్టెంబరు 24 న అంగారక కక్ష్య లోకి చేరింది. గమ్య స్థానాన్ని చేరేందుకు దీనికి 10 నెలల సమయం పట్టింది.