సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు “భర్త గొప్ప ప్రేమికుడిగాఉండాలి”

ఓ వివాదాస్పద మతాంతర వివాహం కేసులో సుప్రీం కోర్టు ఆసక్తికంరంగా వ్యాఖ్యానించింది. హిందూ అమ్మాయిని వివాహం చేసుకోడానికి ముస్లిం మతానికి చెందిన ఓ వ్యక్తి తన మతాన్ని మార్చుకున్నాడు. అయితే ఆ యువకుడు మోసం చేస్తున్నాడంటూ అమ్మాయి తరపు కుటుంబం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ కుమార్తెను వలలో వేసుకునే రాకెట్లో భాగంగానే తమ కుమార్తెను వివాహం చేసుకున్నాడని వదువు తండ్రి కోర్టుకు తెలిపాడు. అయితే ఈ కేసులో సుప్రీం స్పందిస్తూ కులాంతర, మతాంతర వివాహాలకు న్యాయస్థానాలు […]

సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు  భర్త  గొప్ప ప్రేమికుడిగాఉండాలి

ఓ వివాదాస్పద మతాంతర వివాహం కేసులో సుప్రీం కోర్టు ఆసక్తికంరంగా వ్యాఖ్యానించింది. హిందూ అమ్మాయిని వివాహం చేసుకోడానికి ముస్లిం మతానికి చెందిన ఓ వ్యక్తి తన మతాన్ని మార్చుకున్నాడు. అయితే ఆ యువకుడు మోసం చేస్తున్నాడంటూ అమ్మాయి తరపు కుటుంబం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ కుమార్తెను వలలో వేసుకునే రాకెట్లో భాగంగానే తమ కుమార్తెను వివాహం చేసుకున్నాడని వదువు తండ్రి కోర్టుకు తెలిపాడు. అయితే ఈ కేసులో సుప్రీం స్పందిస్తూ కులాంతర, మతాంతర వివాహాలకు న్యాయస్థానాలు వ్యతిరేకం కాదని అంటూ ఈ కేసులో భర్త గురించి మాట్లాడుతూ “నమ్మకమైన భర్తగా ఉండాలని, గొప్ప ప్రేమికుడిలా చూసుకోవాలి”అంటూ వ్యాఖ్యానించింది. చత్తిస్‌గఢ్‌కు చెందిన వ్యక్తులు దాఖలు చేసిన ఈ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రా నేత‌త్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి ఈ విధంగా వ్యాఖ్యానించింది.

అయితే వధువు తండ్రి చేస్తున్న ఆరోపణలపై సుప్రీం కోర్టు కేసులో భర్తకు నోటీసులు జారీ చేసింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేసి, తన విశ్వసనీయతను నిరూపించుకోవాలంటూ ఆదేశించింది. మరోవైపు అమ్మాయికి భద్రత కల్పించే విషయంలో ఆమె నుంచి వివరణ తీసుకోవాలని చత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Published On - 9:27 pm, Wed, 11 September 19

Click on your DTH Provider to Add TV9 Telugu