వేధింపులను ప్రతిఘటించిన యువతిని..కదులుతున్న రైలు నుంచి తోసేశాడు.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని బండా జిల్లాకు చెందిన ఓ యువతి.. ఏప్రిల్ 27న మధ్యప్రదేశ్(Madya Pradesh) రాష్ట్రంలోని ఛతర్‌పూర్ జిల్లాలో ఉన్న బాగేశ్వర్ ధామ్ ఆలయానికి వచ్చింది. దైవ దర్శనం అనంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు రాత్రి రైల్లో...

వేధింపులను ప్రతిఘటించిన యువతిని..కదులుతున్న రైలు నుంచి తోసేశాడు.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన
Chatarpur
Ganesh Mudavath

|

Apr 30, 2022 | 8:02 PM

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. వేధింపులను ప్రతిఘటించిందని ఓ యువకుడు యువతిని కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని బండా జిల్లాకు చెందిన ఓ యువతి.. ఏప్రిల్ 27న మధ్యప్రదేశ్(Madya Pradesh) రాష్ట్రంలోని ఛతర్‌పూర్ జిల్లాలో ఉన్న బాగేశ్వర్ ధామ్ ఆలయానికి వచ్చింది. దైవ దర్శనం అనంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు రాత్రి రైల్లో బయల్దేరింది. ఒంటరిగా ఉన్న ఆమెను అదే బోగీలో ఉన్న ఓ వ్యక్తి వేధించడం ప్రారంభించాడు. యువతి అతనిని ప్రతిఘటించింది. తన వద్దకు రావద్దని, దూరంగా ఉండాలని యువతి సూచించింది. అతడ్ని నిలువరించేందుకు ఆ వ్యక్తి చేతిని కొరికింది. ఈ ఘటనతో సదరు ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. రైలు ఖజురహో, మహోబా స్టేషన్ల మధ్య ఉన్న సమయంలో యువతిని కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. వేగంగా ప్రయాణిస్తున్న రైలు నుంచి తోసేయడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. రైలు పట్టాల పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న యువతిని గమనించిన స్థానికులు.. రైల్వే అధికారులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం బాధితురాలిని ఛతర్‌పూర్‌లోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ప్యాసింజర్ రైలులో ఈ దుర్ఘటన జరిగినట్లు జబల్‌పూర్ ప్రభుత్వ రైల్వే పోలీసు ఎస్పీ వినాయక్ వర్మ వెల్లడించారు. యువతిని తోసేసిన వ్యక్తిని గుర్తించామని, అతణ్ని అరెస్టు చేస్తామని వివరించారు.

ఘటన జరిగిన తర్వాత.. ముందుగా ఖజురహో పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మెరుగైన విచారణ కోసకం కేసును రేవా జీఆర్‌పీ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇటీవల ఛతర్‌పూర్‌లోని బాగేశ్వర్ ధామ్ ఆలయానికి వచ్చా. తిరుగు ప్రయాణంలో రైల్లో ఓ ప్రయాణికుడు నన్ను వేధించడం ప్రారంభించాడు. నేను అతని ప్రయత్నాలను ప్రతిఘటించా. నిలువరించేందుకు అతని చేతిపై కూడా కొరికా. దీంతో ఆ వ్యక్తి నన్ను కదులుతున్న రైలు నుంచి తోసేశాడని.. యువతి వివరించింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu