Viral: ట్రైన్‌లో పోలీసులు కనిపించగానే తత్తరపాటుకు గురైన యువకుడు.. అనుమానంతో అతని లగేజ్ చెక్ చేయగా

కేటుగాళ్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఎప్పుటికప్పుడూ అప్‌డేట్ అవుతూ పోలీసులను బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తమ క్రియేటివిటీకి పదును పెట్టి మరీ క్రైమ్స్ చేస్తున్నారు.

Viral: ట్రైన్‌లో పోలీసులు కనిపించగానే తత్తరపాటుకు గురైన యువకుడు.. అనుమానంతో అతని లగేజ్ చెక్ చేయగా
representative image
Follow us

|

Updated on: Jul 10, 2022 | 1:32 PM

ట్రైన్లలో ప్రయాణీకుల సేఫ్టీ కోసం RPF ఫోర్స్‌తో పాటు ప్రత్యేక బలగాలు గస్తీ తిరుగుతూ ఉంటాయి. రన్నింగ్ ట్రైన్‌లో ప్రతి భోగీలోకి వెళ్తూ.. వారు ప్రయాణీకుల భద్రతను పర్యవేక్షిస్తారు. ఎవరైనా కాస్త తేడాగా ప్రవర్తించినా.. లేదా అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు కనిపించినా.. వెంటనే అలెర్టై యాక్షన్ తీసుకుంటారు. తాజాగా బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్ నుంచి కేరళలోని ఎర్నాకులం వెళ్లే పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలులో సేలం ప్రత్యేక బలగాలు తనిఖీ చేస్తున్నాయి. ఆ సమయంలో ట్రైన్ వాణియంపాడి, జొల్లార్‌పేట రైల్వేస్టేషన్ల మధ్య వెళ్లుంది. ఓ కోచ్‌లో ఉన్న వ్యక్తి ప్రవర్తనతో బలగాలకు అనుమానం కలిగింది.  దీంతో సదరు ప్రయాణికుడి వస్తువులను సోదా చేశారు. ట్రావెల్ బ్యాగ్‌లో 6 కిలోల గంజాయి ఉంచినట్లు గుర్తించి.. అతడని అదుపులోకి తీసుకున్నారు. శనివారం ప్రత్యేక బలగాలు.. ఆ యువకుడిని జొల్లార్‌పేట రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు జోలార్‌పేట రైల్వే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇలచస్చి, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జయకుమార్‌, ఇతర పోలీసులు దర్యాప్తు చేసి.. నిందితుడు ఒరిస్సాలోని భత్రక్‌ మహదేపసాహి ప్రాంతానికి చెందిన గౌతమ్‌దాస్‌గా గుర్తించారు. భత్రక్‌ ప్రాంతం నుంచి తిరుపూర్‌ ప్రాంతానికి గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు  నిందితుడు అంగీకరించాడు. వారు అతన్ని తిరుపత్తూరు కోర్టులో హాజరుపరిచి.. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Ganja

అక్రమార్జనకు అలవాటు పడ్డ గంజాయి స్మగ్లర్లు, గంజాయిని రాష్ట్రాల సరిహద్దులు దాటించేందుకు సరికొత్త స్కెచ్చులు వేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా గంజాయిని తరలించే ఏకైక లక్ష్యంతో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ముందుకు వెళ్తున్నారు. రోడ్డు మార్గంలో తనిఖీలు పెరగడంతో ఇప్పుడు రైలు మార్గాన్ని ఎన్నకున్నారు. అయినప్పటికీ ప్రత్యేక బలగాలు కేటుగాళ్ల ఫ్లాన్స్‌ను భగ్నం చేస్తున్నారు.

జాతీయ వార్తల కోసం